చిరంజీవి-నాగార్జున రెడీ ! ఛాన్స్ తీసుకునేదెవరు?
మెగాస్టార్ చిరంజీవి-కింగ్ నాగార్జున ప్రెండ్ షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఇద్దరు క్లోజ్ ప్రెండ్స్. ఆ స్నేహంతోనే భాగస్వాములుగా వ్యాపారాలు చేస్తున్నారు
మెగాస్టార్ చిరంజీవి-కింగ్ నాగార్జున ప్రెండ్ షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఇద్దరు క్లోజ్ ప్రెండ్స్. ఆ స్నేహంతోనే భాగస్వాములుగా వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఆ కాంబినేషన్ లో మల్టీస్టారర్ మాత్రం తెరకెక్కలేదు అన్న అసంతృప్తి హీరోలిద్దరి అభిమానుల్లో మాత్రం బలంగా ఉంది. తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ ఎప్పుడో మొదలైంది? వీరిద్దరు అంత క్లోజ్ గా ఉండి కూడా ఎందుకు కలిసి పనిచేయరు? అని అభిమానులు అడుగుతున్నారు.
ఇద్దర్నీ ఒకే ప్రేమ్ లో చూసుకోవాలని అభిమానులెంతో ఉవ్విళ్లూరుతున్నారు. అదే జరిగితే అక్కినేని-మెగా అభిమానుల ద్వయం హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ కాంబినేషన్ సాధ్యమేనా? కలిసి పనిచేయడానికి చిరు-నాగ్ ఒకే చెబుతారా? అంటే అందులో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ఆ మధ్య అమీర్ ఖాన్ తో జరిగిన ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
బాలీవుడ్ లో అమీర్ ఖాన్-అమితాబచ్చన్ కలిసి నటించారు. తెలుగులో నాగ్ -నేను నటిస్తే బాగుంటుంది అన్న మాట స్వయంగా చిరు నోట వచ్చింది. ఆ మాట విని నాగార్జున ఎంతో సంతోషించారు. అంతకన్నా గ్రేట్ ధింగ్ ఏముంటుంది? అన్నారు. ఆ రకంగా ఇద్దరి నుంచి ఆనాడే గ్రీన్ సిగ్నెల్ వచ్చేసింది. కానీ ఇక్కడ దర్శకుడు సెట్ అవ్వడం అన్నదే కష్టమైన పని. చిరు-నాగ్ లాంటి ఇద్దరు స్టార్లని ఒకే ప్రేమ్ లో చూపించడం అంటే ఆషామాషీ విషయం కాదు.
ఇద్దరి ఇమేజ్ లకు తగ్గ కథ కావాలి. రెండు పాత్రల్ని పక్కాగా బ్యాలెన్స్ చేయగలిగే రోల్స్ సిద్దం చేయాలి. అది కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండాలి. ఈ రోజుల్లో ఇద్దరు పెద్ద స్టార్లు సినిమా తీస్తున్నా రంటే? అది పాన్ ఇండియా అనే అభిమానులు ఆశిస్తారు. అందులోనూ కంటెంట్ యూనిక్ గా ఉండాలి. రెండు పాత్రలు కొన్నాళ్ల పాటు గుర్తిండిపోయేలా ఉండాలి. అలాంటి కథ కుదిరితే ఆ ఇద్దరు ఒకే ప్రేమ్ లో సెట్ అవ్వడం పెద్ద విషయం కాదు. మరి రెడీగా ఉన్న ఈ అవకాశాన్ని ఏ దర్శకుడు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.