ఉర్పీ జావేద్ కొన్నాళ్లు కామ్ గా ఉంటే మంచిదేమో!
ఉర్జీ జావేద్ వీడియో వెనుక ఇంత కథ నడించింది అన్న సంగతి పోలీసులు అధికారికంగా వెల్లడించే వరకూ ఎవరికీ తెలియదు. ఉర్పీని అరెస్ట్ చేసింది నకిలీ పోలీసులని తేలింది.
ఉర్పీ జావేద్ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట ఎంత సంచలమైనందో తెలిసిందే. అమ్మడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ఓ ఫేక్ వీడియో సృష్టించి నెట్టింట వదలడంతో? అంతా నిజమని షాక్ అయ్యారు. దీంతో ముంబై పోలీసుల్ని నెటిజనులు ట్రోల్ చేసారు. దీంతో రంగంలోకి దిగిన నిజమైన ముంబై పోలీసులు ఉర్పీ సంగతేంటో? తేల్చే పనిలో పడ్డారు. ఇదంతా ఫేక్ వీడియో అని..ప్రచారం కోసం ఇలా తెగించిందని పోలీసులు నిర్దారించుకున్నారు.
ఉర్జీ జావేద్ వీడియో వెనుక ఇంత కథ నడించింది అన్న సంగతి పోలీసులు అధికారికంగా వెల్లడించే వరకూ ఎవరికీ తెలియదు. ఉర్పీని అరెస్ట్ చేసింది నకిలీ పోలీసులని తేలింది. దీంతో ఉర్పీతో పాటు ఆ వీడియో లో ఉన్న వారిందరిపై ముంబై పోలీసులు కేసులు నమెదు చేసారు. వీడియోలో పోలీస్ యూనిఫాం..సింబల్స్ దుర్వినియోగ పరిచినందుకు ఉర్జీ జావేద్ పై 171.419..500..34 సెక్షన్ల కింద కేసులు నమెదు చేసారు.
ఇలా వీడియో చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? ఎందుకు చేయాల్సి వచ్చింది? వంటి వివరాలు ఆరా తీస్తున్నారు. పబ్లిసిటీ కోసం చట్టంతో ఆటలేంటని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నెటి జనులు ఉర్పీ జావెద్ పై ఎటాకింగ్ దిగారు. ఇదంతా ఉర్పీకి తెలియకుండానే చేసిందంటారా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే పబ్లిసిటీ కోసం ఇలాంటి ఫేక్ వీడియో చేసిందని మండిపడు తున్నారు.
ప్రచారం చేసుకోవడానికి కూడా ఓ హద్దు ఉంటుందని...సోషల్ మీడియాలో అందుబాటులో ఉందని ఇష్టానుసారం వీడియోలు చేసి పెడితే? కఠినంగా శిక్షించాలని పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా ఉర్పీ జావేద్ పై ఈ మధ్య నెగిటివిటీ ఎక్కువవుతున్నట్లే కనిపిస్తుంది. రాజ్ కుంద్రాతో వివాదం...భూల్ భులయ్యా-2 లో ఛోటా పండిట్ పాత్ర గెటప్ పై ఓ వర్గం ఉర్పీకి వార్నింగ్ ఇవ్వడం అన్నీ అశుభుసూ చికాలుగా కనిపిస్తున్నాయి. ఈ వేడి చల్లారంతే వరకూ కొన్ని రోజుల పాటు ఉర్జీ జావేద్ సైలెంట్ గా ఉండటం మంచిదేమో.