రెహమాన్ తర్వాత బాదుడు ఆ యువకుడిదేనా?
ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే సంగీత దర్శకులు ఎవరంటే? ముందుగా ఏ. ఆర్ రెహమాన్ పేరు వినిపిస్తుంది
ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే సంగీత దర్శకులు ఎవరంటే? ముందుగా ఏ. ఆర్ రెహమాన్ పేరు వినిపిస్తుంది. ఒక్కో పాటకు రెహమాన్ 3 కోట్లు ఛార్జ్ చేస్తారు. ఆ లెక్కన సినిమాలో ఎన్ని పాటలుంటే అన్ని పాటలకు అన్ని కోట్లు సమర్పించుకోవాల్సిందే. ఇలా పాట చొప్పున కోట్లు వసూల్ చేసే ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ కూడా అతనే. సినిమాలకంటే కూడా ఎక్కువ ఆదాయం మ్యూజిక్ కన్సర్ట్ ద్వారా సమకూరుతుండటంతో! వాటిపైనే రెహమాన్ కొంత కాలంగా దృష్టి పెడుతున్నారు.
రెహమాన్ తర్వాత అమిత్ త్రివేది- విశాల్ - శేఖర్- రాజేష్ రోషన్ లాంటి వారు కొంత మంది ఉన్నారు. వీళ్లంతా సినిమాని బట్టి ఛార్జ్ చేస్తుంటారు. ఎలా ఛార్జ్ చేసినా రెహమాన్ కంటే తక్కువే. అయితే ఇప్పుడీ దిగ్గజాల్ని సహా రెహమాన్ ని యువ సంచలనం అనిరుద్ బీట్ చేసాడని వినిపిస్తోంది. జవాన్ సినిమా కోసం అనిరుద్ భారీగానే ఛార్జ్ చేసాడని..ఆ మొత్తం రెహమాన్ పారితోషికాన్నే బీట్ చేసేలా ఉందని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమాకి రెహమాన్ లా పాట చొప్పున కాకుండా ఓ ప్యాకేజ్ లా భారీ మొత్తం పారితోషికంగా అందుకు న్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ షారుక్ ఖాన్ స్వయంగా నిర్మించిన సంగతి తెలిసిందే. సదరు నిర్మాణ సంస్థ కూడా ఏ సంగీత దర్శకుడికి ఇంతవకూ ఇంత భారీ మొత్తంలో చెల్లించిలేదని అంటున్నారు. అనిరుద్ గత సినిమాలకు అందించిన సంగీతం..అతని ట్రాక్ రికార్డు చూసి షారుక్ స్వయంగా కోట్ల రూపాయల చెక్ అందించారుట.
ఇక అనిరుద్ తెలుగు సినిమాలు ఎక్కువ చేయకపోవడానికి పారితోషికం కారణమనే విమర్శ వినిపిస్తోంది. ఇతను కూడా రెహమాన్ తరహాలో తెలుగు సినిమా అనే సరికి పాట కింత ఇవ్వండని డిమాండ్ చేస్తున్నా డుట. మొత్తం అన్ని పాటలకు కలిపి కాకుండా ఒక్కో పాట చోప్పున అడుగుతున్నారుట. మినిమం రెండున్నర కోట్ల నుంచి మొదలు పెడుతున్నారుట. అంతకు తక్కువైతే టాక్స్ కూడా అంగీకరించడం లేదుట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' సినిమాకి సంగీతం అందిస్తుంది ఆయనే కాబట్టి ఎంత చెల్లిస్తున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.