వెంకటేష్, నానిల గురించి ముత్తయ్య మురళీధరన్
శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' ని అక్టోబర్ 6వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి
శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' ని అక్టోబర్ 6వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. తెలుగు లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించారు.
హైదరాబాద్ లో జరిగిన '800' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా టీం ఇండియా మాజీ స్టార్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ముత్తయ్య మురళీధరన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక గొప్ప క్రికెటర్ కమ్ వ్యక్తి అన్నట్లుగా ముత్తయ్య పై ప్రశంసలు కురిపించాడు.
ఇక ముతయ్య మురళీధరన్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ... లక్ష్మణ్ ను మొదటి సారి 1998 లో కటక్ లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో కలిశాను. టీనేజ్ లోనే తన ఆటతో అందరికి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా సార్లు లక్ష్మణ్ ని కలిశాను. ఇద్దరం కూడా చాలా సార్లు ఆడాము. స్పిన్ బౌలింగ్ ను లక్ష్మణ్ అద్భుతంగా ఎదుర్కొంటారు.
ఇక హైదరాబాద్ గురించి మాట్లాడుతూ తనకు ఈ ప్రదేశం చాలా స్పెషల్ అన్నాడు. హైదరాబాద్ కి తొలిసారి వచ్చినప్పుడు ఇంత అభివృద్ధి చూడలేదు. కానీ ఎత్తైన భవనాలు, ఐటీ కంపెనీలతో ఇండియాలోనే అత్యంత స్పీడ్ గా అభివృద్ది చెందుతున్న నగరంగా ఈ నగరం నిలిచిందని ముత్తయ్య మురళీధరన్ అన్నాడు.
ఐపీఎల్ నుండి రిటైర్డ్ అయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటర్ గా చేయమని అడిగారు. ఒక సారి నాకు బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పడంతో అరగంటలో లక్ష్మణ్ చాలా రకాల బిర్యానీలు విమానంలోకి తెప్పించారని ముత్తయ్య గుర్తు చేసుకున్నారు.
ఇక టాలీవుడ్ స్టార్స్ అయిన వెంకటేష్ మరియు నాని గురించి ముత్తయ్య మాట్లాడుతూ.. వెంకటేష్ గారికి క్రికెట్ అంటే చాలా అభిమానం. అందుకే ఆయన్ను సెలబ్రెటీ క్రికెట్ జట్టుకి కెప్టెన్ గా చేయాలి. ఇక నాని నటించిన జెర్సీ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి నానితో నేను మాట్లాడాను అంటూ ముత్తయ్య గుర్తు చేసుకున్నారు.