'పొట్టేల్'ని పట్టిన మైత్రి

ఇదిలా ఉంటే ఈ సినిమా నైజాం రైట్స్ ని మైత్రీ మూవీ డిస్టిబ్యూటర్స్ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు.

Update: 2024-10-10 07:14 GMT

కంటెంట్ బావున్న చిన్న సినిమాలకి ఈ మధ్యకాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. గత రెండు నెలల్లో టాలీవుడ్ కి ఐదు హిట్స్ లభించాయి. వాటిలో నాలుగు మూవీస్ చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం విశేషం. పెట్టిన పెట్టుబడి కంటే రెట్టింపు కలెక్షన్స్ ని ఈ సినిమాలు అందుకున్నాయి. దీనిని బట్టి కంటెంట్ బాగుంటే క్యాస్టింగ్ తో పని లేకుండా మూవీస్ ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రూవ్ అయ్యింది.


ఒక్కోసారి సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో కొన్ని సినిమాలు బాగున్నాయనే టాక్ తెచ్చుకున్న ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేకపోతాయి. పెద్ద ప్రొడక్షన్ హౌస్ ల నుంచి మూవీస్ థియేటర్స్ లోకి ఈజీగా హైప్ క్రియేట్ చేసుకుంటాయి. అలాగే మంచి ప్రమోషన్ లభిస్తుంది. కంటెంట్ ని నమ్ముకొని అక్టోబర్ 25న థియేటర్స్ లోకి రాబోతున్న మరో చిత్రం పొట్టేల్.

ఇదిలా ఉంటే ఈ సినిమా నైజాం రైట్స్ ని మైత్రీ మూవీ డిస్టిబ్యూటర్స్ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. యువచంద్ర, అనన్య నాగళ్ళ జోడీగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాహిత్ మొత్ఖురి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. అజయ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు.

పీరియాడిక్ జోనర్ లో ఈ మూవీ కథాంశం ఉండబోతోంది. తెలంగాణలో పటేల్ వ్యవస్థ ఒకప్పుడు ఉండేది. నిమ్న వర్గాలపై వారు పెత్తనం చేసేవారు. ఆ బ్యాక్ డ్రాప్ లోనే పొట్టేల్ కథని కూడా దర్శకుడు సాహిత్ చెప్పినట్లున్నాడు. తెలంగాణ నేపథ్యంలో నడిచే కథ కాబట్టి కచ్చితంగా నైజాంలో మూవీకి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. బడా డిస్టిబ్యూటర్స్ అయినా మైత్రీ వారే నేరుగా పొట్టేల్ నైజాం రైట్స్ తీసుకోవడంతో స్ట్రాంగ్ గా జనాల్లోకి సినిమాని తీసుకువెళ్లే ఛాన్స్ ఉంటుంది.

అనన్య నాగళ్ళ, అజయ్ లాంటి ఫేమ్ ఉన్న యాక్టర్స్ ఉండటంతో పబ్లిక్ అటెన్షన్ కూడా చిత్రంపై ఉంటుంది. కొత్తదనం ఉన్న కథలని ఇష్టపడే ప్రేక్షకులు పొట్టేల్ సినిమాని ఆదరిస్తారని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. మరి దీపావళి ఫెస్టివల్ కి ముందు రానున్న ఈ చిత్రం ఏ మేరకు పబ్లిక్ కి కనెక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News