8 వసంతాలు.. అందరి ఫోకస్ టీజర్ పైనే..

ఇప్పటికే పోస్టర్స్ తో ఎట్రాక్ట్ చేస్తోన్న ఈ మూవీ క్యారెక్టర్ టీజర్ ని దసరాకి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఎనౌన్స్ చేశారు.

Update: 2024-10-09 09:21 GMT

‘తను’ మూవీ ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి మరల ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ‘8 వసంతాలు’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫిమేల్ సెంట్రిక్ కథాంశంతో సిద్ధం అవుతోన్న ఈ చిత్రంలో అనంతిక సునీల్ కుమార్ మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇప్పటికే పోస్టర్స్ తో ఎట్రాక్ట్ చేస్తోన్న ఈ మూవీ క్యారెక్టర్ టీజర్ ని దసరాకి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే తాజా టీజర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు.


అక్టోబర్ 12న సుద్ధి అయోధ్య క్యారెక్టర్ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ట్విట్టర్ లో మేకర్స్ ప్రకటించారు. అలాగే పోస్టర్ కూడా ట్వీట్ కి జత చేశారు. చుట్టూ కురుస్తున్న మంచులో చీర కట్టుకొని పైన దుప్పటి కప్పుకొని ఉన్న హీరోయిన్ ఫోటోని పోస్టర్ లో చూపించారు. ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ లవ్ డ్రామాగా దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించినట్లు పోస్టర్స్ చూస్తుంటే అర్ధమవుతోంది. అందరూ కొత్తవాళ్లతో మూవీ కథని చెబుతున్నట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తోంది అంటేనే కంటెంట్ లో కచ్చితంగా ఇంటరెస్టింగ్ విషయం ఉంటుందనే అభిప్రాయం పబ్లిక్ లోకి వెళ్ళింది. డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి కూడా ‘మధురం’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ తో ఒక ప్రేమకథని పొయిటిక్ గా ప్రెజెంట్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. చాందిని చౌదరి లీడ్ రోల్ లో ‘తను’ అనే సినిమాతో దర్శకుడిగా బిగ్ స్క్రీన్ పై పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని తెరపై చూపించారు.

ఇప్పుడు ‘8 వసంతాలు’ చిత్రంలో ఒక అమ్మాయి లైఫ్ జర్నీని ఆవిష్కరించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘హాయ్ నాన్న’, ‘ఖుషి’ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ మంచి ఆల్బమ్స్ అందించిన హేసమ్ అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దీనిని బట్టి ఈ సినిమాలో కూడా అద్భుతమైన మెలోడీ సాంగ్స్ ఉండే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది.

సుద్ధి అయోధ్య క్యారెక్టర్ టీజర్ రోజే ‘8 వసంతాలు’ మూవీ రిలీజ్ కూడా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో లవ్ డ్రామాగా రాబోయే ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News