మైత్రీ వాళ్లను లాక్ చేసిందా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తోన్న `పుష్ప-2` షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తోన్న `పుష్ప-2` షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టులో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో పెండింగ్ పనులు వేగవంతమయ్యాయి. అయితే కీలకమైన షెడ్యూల్స్ ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. అందుకోసం జూన్ నుంచే పహాద్ పాజిల్ డేట్లు ఇచ్చాడు. పహాద్, బన్నీ సహా కీలక పాత్రలపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. ప్రస్తుతం సుకుమార్ ఆ పనుల్లోనే ఉన్నాడు.
బన్నీ, పహాద్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. షూటింగ్ కోసం క్లియర్ కట్ గా డేట్లు ఇచ్చేసారు. అయితే సునీల్, అనసూయ, రావు రమేష్ కూడా ఇంకా చాలా సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందిట. పుష్ప-2 తో పాటు ఇతర చిత్రాలకు కూడా వీళ్లంతా డేట్లు కేటాయించారు. పుష్ప సినిమాతో పాటు వాటిని కూడా పూర్తి చేయాల్సిన అవసరం అంతే ఉంది. అయితే నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ తాజాగా ఈ ముగ్గురు నటుల్ని కూడా బ్లాక్ చేసి పెట్టిందిట.
ఈ రెండు నెలల పాటు పూర్తిగా తమకు అందుబాటులో ఉండాలని సూచించిందిట. షూటింగ్ నెల రోజుల్లో పూర్తవుతుంది. అటుపై ప్రచారం కోసం మరో నెల రోజులు కేటాయించాలని తెలిపిందిట. అందుకు నటులు కూడా అంగీకరించారుట. ప్రస్తుతం ఆ ముగ్గురు వేర్వేరు సినిమాల్లో నటిస్తున్నా? ఆ డేట్లతో మైత్రీ బ్లాక్ చేసిన డేట్లు క్లాష్ కాకపోవడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంటామని చెప్పారుట.
అయితే అందుకు అదనంగా పారితోషికం చెల్లిస్తున్నారా? లేక అడ్జస్ట్ మెంట్ ప్రకారం జరుగుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. డేట్లు ఇచ్చిన సమయంలో షూటింగ్ పూర్తిచేయకపోతే ఇలాంటి సమస్యలు ఉత్పన్న అవడం సహజమే. నిర్మాణ సంస్థలతో దర్శక హీరోలతో ఉన్న ర్యాపోతో స్నేహ పూర్వకంగా పూర్తి చేస్తుంటారు. `పుష్ప-2` జులై మూడవ వారంకల్లా షూటింగ్ పూర్తవుతుందిట. అటుపై ప్రచారం పనులు ప్రారంభమవుతాయి. ఆగస్టు 15 రిలీజ్ కాబట్టి అప్పటివరకూ టీమ్ తోనే ఉండాల్సి ఉంటుంది.