జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ హవా
ఆసక్తికరంగా పాపులర్ టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ ఏడాది నిజంగా జాక్ పాట్ కొట్టిందన్న ముచ్చటా ఇప్పుడు వేడెక్కిస్తోంది.
2021లో రిలీజైన సినిమాలకు జాతీయ అవార్డుల్ని నేడు ప్రకటించారు. ఈరోజు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ప్రకటించింది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా అవార్డును అందుకోగా.. ఆర్.ఆర్.ఆర్ ఏకంగా 6 అవార్డులను గెలుచుకుంది. ఇది తెలుగు ప్రజలు గర్వించదగిన అరుదైన సందర్భం. ఆస్కార్ .. గోల్డెన్ గ్లోబ్స్.. హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలను ఆర్.ఆర్.ఆర్ గెలుచుకుంది.
ఇప్పుడు అదే చిత్రం జాతీయ అవార్డుల్లోను హవా సాగించగా.. పుష్ప చిత్రానికి ఉన్నతమైన పురస్కారం దక్కడం ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఆసక్తికరంగా పాపులర్ టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ ఏడాది నిజంగా జాక్ పాట్ కొట్టిందన్న ముచ్చటా ఇప్పుడు వేడెక్కిస్తోంది.
అల్లు అర్జున్ ను జాతీయ ఉత్తమ నటుడిగా నిలబెట్టిన పుష్ప చిత్రాన్ని నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్. మైత్రి సంస్థ నిర్మించిన సినిమాలు జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. మైత్రి సంస్థ మూడు జాతీయ అవార్డులను గెలుచుకుంది.
పుష్ప: ది రైజ్ చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకోగా, దేవి శ్రీ ప్రసాద్‌కు ఉత్తమ సంగీత దర్శకుడి విభాగంలో అవార్డు లభించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన 'ఉప్పెన' ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు) విభాగంలో అవార్డును కైవసం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్‌కి 2023 మరపురాని సంవత్సరం అనడంలో సందేహం లేదు.
మరోవైపు 2023లోను మైత్రి సంస్థ వరుస హిట్లతో జోష్ మీద ఉంది. ఏడాది ఆరంభంలోనే విడుదలైన వాల్తేర్ వీరయ్య - వీరసింహా రెడ్డి బ్లాక్ బస్టర్స్ కొట్టాయి. ఇదే బ్యానర్ నుండి ఖుషి విడుదలకు సిద్ధమవుతోంది. మునుముందు మరిన్ని భారీ చిత్రాలను మైత్రి నిర్మిస్తోంది. తదుపరి పుష్ప 2 చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తోంది.
ఎన్టీఆర్ - కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అత్యంత భారీ చిత్రాన్ని ఈ సంస్థ నిర్మించనుంది. రాబోవు నాలుగైదేళ్లలో భారీ అతిభారీ సినిమాలతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ టాలీవుడ్ లో హవా సాగించనుంది. పరిశ్రమ అగ్ర హీరోలందరితోను ఈ సంస్థ సినిమాలు చేస్తూ సంచలనాల్ని నమోదు చేస్తోంది.