రవితేజ స్కూల్ డేస్ లవర్.. ఇప్పుడెలా ఉందో చూశారా..?

పెళ్లయ్యాక మహిళల్లో మార్పులు సహజం.. ఈ క్రమంలో భర్త, పిల్లలతో విమల కంప్లీట్ ఫ్యామిలీ ఉమెన్ గా మారిపోయింది.

Update: 2024-10-11 10:30 GMT

మాస్ మహారాజ్ రవితేజ తో స్కూల్ డేస్ లో లవ్ స్టోరీ నడిపించాడు. ఆయన ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు. స్కూల్ డేస్ లవ్ ని మర్చిపోలేని రవితేజ తన పెళ్లికి ఆమెను పిలిచేందుకు వెళ్లాడు. ఏంటి ఇదంతా నిజమేనా అంటే అవును నిజమే కానీ రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. మాస్ మహరాజ్ రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమా 2004 లో వచ్చింది. అందులో మల్లిక పాత్ర చేసిన విమల అప్పట్లో ప్రేక్షకులకు బాగా నచ్చింది.

ఆ సినిమా తర్వాత ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఐతే సినిమాలు చేసినంత వరకు చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది విమల. ఐతే ఈమధ్య ఒకప్పటి తారలంతా కూడా మళ్లీ సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ ను అలరిస్తున్నారు. ఈ క్రమంలో రవితేజ నా ఆటోగ్రాఫ్ సినిమాలో ఒక హీరోయిన్ అయిన విమల కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

పెళ్లయ్యాక మహిళల్లో మార్పులు సహజం.. ఈ క్రమంలో భర్త, పిల్లలతో విమల కంప్లీట్ ఫ్యామిలీ ఉమెన్ గా మారిపోయింది. ఆఫ్టర్ లాంగ్ టైం విమలని చూసి ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఒకప్పటి హీరోయిన్స్ అంతా కూడా రీ ఎంట్రీ ఇస్తున్న ఈ టైం లో విమల కూడా మళ్లీ సినిమాల్లో నటిస్తుందా.. ఎలాగు హీరోయిన్ గా ఛాన్స్ లు రావడం కష్టమే కాబట్టి సపోర్టింగ్ రోల్స్ కు ఆమె పర్ఫెక్ట్ అనేలా ఉంది.

ఈమధ్య సపోర్టింగ్ రోల్స్ చేసే వారు లేక ఎవరెవరినో పెట్టేస్తున్నారు. సో విమల మళ్లీ నటించడం మొదలు పెడితే మాత్రం కచ్చితంగా ఆమెకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మల్లికగా ప్రేక్షకులను అలరించిన విమల రీ ఎంట్రీతో మళ్లీ ప్రేక్షకులను అలరించేలా చేస్తుందని భావిస్తున్నారు. విమల ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రవితేజ పక్కన నటించిన ఈమె ఇప్పుడు అసలేమాత్రం గుర్తు పట్టలేని విధంగా మారింది. మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్న విమలకు సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

Tags:    

Similar News