సంతాన ప్రాప్తిరస్తు: హార్ట్ టచింగ్ గా ‘నాలో ఏదో....'
రేడియో మిర్చిలో ఈ పాట లాంచ్ ఈవెంట్ జరిగింది. ప్రేమలో పరవశించే మనసుల భావోద్వేగాన్ని ఈ పాట సున్నితంగా చూపించింది.;

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంతాన ప్రాప్తిరస్తు సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. టీజర్‌కు వచ్చిన స్పందనతో సినిమా మీద ఆసక్తి నెలకొనగా, తాజాగా విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘నాలో ఏదో..’ ఈ హైప్‌ను మరింత పెంచింది. రేడియో మిర్చిలో ఈ పాట లాంచ్ ఈవెంట్ జరిగింది. ప్రేమలో పరవశించే మనసుల భావోద్వేగాన్ని ఈ పాట సున్నితంగా చూపించింది.
సునీల్ కశ్యప్ అందించిన మెలోడియస్ ట్యూన్, శ్రీజో అందించిన ఎమోషనల్ లిరిక్స్ ఈ పాటను యూత్‌కు దగ్గర చేస్తూ, సూటిగా గుండెను తాకుతున్నాయి. ‘నాలో ఏదో మొదలైందని.. నీతో చెలిమే రుజువైందని..’ అంటూ సాగే ఈ పాట, ప్రేమలోని భిన్నమైన భావాలను హైలెట్ చేస్తోంది. దినకర్ కల్వల, అదితి భావరాజు గాత్రాల్లో ఈ పాట మరింత వినసొంపుగా అనిపిస్తుంది. విజువల్‌గా కూడా ఇది మంచి లవ్ మూడ్‌ను ట్రాన్స్‌మిట్ చేయనుంది.
ఈ పాటను గురించి దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, సినిమా కథలో ప్రధాన పాత్రల మధ్య మొదలయ్యే ప్రేమను పాట రూపంలో అందించాలన్న ఆలోచనతో ‘నాలో ఏదో..’ సాంగ్ రూపొందించామని తెలిపారు. మ్యూజిక్ లవర్స్‌కు ఇది ఎప్పటికి గుర్తుండిపోయే పాట అవుతుందని చెప్పారు. లేటెస్ట్ యువత ఆలోచనకు తగ్గట్లే ముందుకు సాగే ఈ కథకు సంగీతం పెద్ద ప్లస్ అవుతుందనడంలో సందేహమే లేదని అన్నారు.
లిరిసిస్ట్ శ్రీజో ఈ పాటకు తన మార్క్ లిరిక్స్ అందించారని, సింగర్ అదితి భావరాజు తెలిపారు. సున్నితమైన భావోద్వేగాల్ని పలికించగలిగే పాట పాడటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ మాత్రం తన ట్యూన్‌కు మంచి స్పందన రావడం హ్యాపీగా ఉందంటూ పాట చార్ట్‌బస్టర్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. గతంలోనూ మధుర ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకు ఆయన ఇచ్చిన ట్యూన్స్ గుర్తుండిపోయేలా నిలిచాయి.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ, సినిమా షూటింగ్ మొత్తం మంచి ఎనర్జీతో జరిగింది. ఈ పాట యూనిట్ మొత్తానికి ఎంతో స్పెషల్‌గా ఉండిందన్నారు. నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ, ‘నాలో ఏదో..’ పాట యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా బాగా కనెక్ట్ అవుతుందన్నారు. అంతేకాదు, గతంలో వారి సంస్థకు సునీల్ కశ్యప్ అందించిన ‘నిన్నలా లేదే..’, ‘మెల్లమెల్లగా..’ లాంటి పాటల విజయాన్ని గుర్తు చేస్తూ ఈ పాట కూడా అదే లెవెల్‌లో నిలుస్తుందని నమ్మకమన్నారు.
ఇక సినిమాలో వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, హర్షవర్థన్, తాగుబోతు రమేష్ లాంటి వారు ఈ సినిమాలో నటించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. ‘సంతాన ప్రాప్తిరస్తు’ పాటలతోనే కాదు, కథతోనూ ఓ ప్రత్యేకమైన మెసేజ్ ఇవ్వబోతోందని ఇప్పటికే సినిమా ప్రొమోస్ సూచిస్తున్నాయి.