నా సామి రంగా.. అప్పుడే అన్ని రూ.కోట్లు లాగేసిందిగా!
మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ మూవీ రూ.32 కోట్ల వరకు రాబట్టినట్లు సమాచారం. అయతే ఈ చిత్రం కోసం నిర్మాత చిట్టూరి శ్రీను రూ.45 కోట్లకుపైగా ఖర్చు చేశారట.
సంక్రాంతికి కింగ్ నాగార్జున సందడి మామూలుగా ఉండదు. గతంలో పెద్ద పండుగకు సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలతో వచ్చి హిట్లు కొట్టిన టాలీవుడ్ మన్మధుడు.. ఈసారి నా సామిరంగా తో రాబోతున్నారు. ఇటీవేల ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. జనవరి 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
కమర్షియల్ కామెడీ అండ్ యాక్షన్ జోనర్ లో రాబోతున్న ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం వల్ల మేకర్స్ ప్రమోషన్ల స్పీడ్ ను పెంచారు. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను హాట్ స్టార్ కు, శాటిలైట్ రైట్స్ ను మాటీవీకి, హిందీ డబ్బింగ్ హక్కులను థర్డ్ పార్టీకి అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ మూవీ రూ.32 కోట్ల వరకు రాబట్టినట్లు సమాచారం. అయతే ఈ చిత్రం కోసం నిర్మాత చిట్టూరి శ్రీను రూ.45 కోట్లకుపైగా ఖర్చు చేశారట.
అంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా బడ్జెట్ లో మూడు వంతులు వచ్చేసినట్లే. ఈ మూవీకి రూ.12కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్న నాగార్జున... తన అన్నపూర్ణ సంస్థ ద్వారానే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల నాన్ రిట్నరబుల్ అడ్వాన్స్ ల మీద సినిమాను ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీపై బజ్ బాగానే ఉంది. పక్కా పండుగ సినిమా అని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు.
ఈ సినిమాలో యంగ్ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ మూవీతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. నాగార్జున సరసన కన్నడ భామ ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. తెలుగు ఆమెకు రెండో చిత్రమిది. నందమూరి కల్యాణ్ రామ్ అమిగోస్ తో తెలుగు తెరకు ఆమె పరిచయం అయ్యారు.