'లిమిట్స్ క్రాస్ చేయకు'.. నటుడికి ఇస్మార్ట్ బ్యూటీ వార్నింగ్!
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ మూవీతో హీరోయిన్ నభా నటేష్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన విషయం తెలిసిందే
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ మూవీతో హీరోయిన్ నభా నటేష్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఇక కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో సినీ ఇండస్ట్రీకి అనూహ్యంగా దూరమైంది. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ బిజీగా మారుతోంది. మెల్లమెల్లగా అవకాశాలు అందుకుంటోంది.
ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ స్వయంభులో నటిస్తోంది నభ. ఇటీవల ఆమె బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. యువరాణి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు నభా నటేష్.. కమెడియన్ ప్రియదర్శితో మరో సినిమా చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రియదర్శికి, నభకు సోషల్ మీడియాలో జరిగిన మాటల యుద్ధం వైరల్ గా మారింది!
నభ లేటెస్ట్ గా హీరో ప్రభాస్ వాయిస్ తో డబ్ స్మాష్ వీడియో చేసి పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోకు తాజాగా స్పందించిన ప్రియదర్శి.. వావ్ సూపర్ డార్లింగ్ కిర్రాక్ ఉన్నావంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఐపీసీ సెక్షన్ 354ఏ ప్రకారం పరిచయం లేని ఒక లేడీని డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపులతో సమానమని రాసి ఉన్న ఒక ఇమేజ్ తో రిప్లై ఇచ్చింది నభ. మిస్టర్.. కామెంట్ చేసే ముందు మాటలు జాగ్రత్త అని కూడా చెప్పింది.
అయితే మనకు పరిచయం లేదని విషయం నాకు తెలియదు, మీరు మాత్రం డార్లింగ్ అనేయొచ్చు, మేం అంటే సెక్షన్లా అని ప్రియదర్శి ప్రశ్నించారు. లైట్ తీసుకో డార్లింగ్ అని మరో కామెంట్ పెట్టారు. దీంతో లిమిట్స్ దాటి ప్రవర్తించకు, తర్వాత చూసుకుందాం అని నభా నటేష్ కాస్త కోపంగా రిప్లై ఇచ్చింది! ఇప్పుడు నభా నటేష్, ప్రియదర్శి చాట్ ఫుల్ వైరల్ గా మారగా.. రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
చాలా మంది నెటిజన్లు.. ప్రియదర్శి, నభ మధ్య నిజంగానే మాటల యుద్ధం జరిగిందని అనుకుంటుండగా.. ఇంకొందరు ఇదొక ప్రమోషనల్ స్టంట్ అని చెబుతున్నారు. ప్రియదర్శి, నభా నటేష్ చేస్తున్న సినిమా టైటిల్ డార్లింగ్ అయి ఉంటుందని అనుమానపడుతున్నారు. అందుకే ఇలా కావాలనే ప్రమోట్ చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మూవీపై ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.