నాగ‌చైత‌న్య డైట్ ప్లాన్ తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!

మ‌రి యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య డైట్ ఎంత మందికి తెలుసు? తెలిస్తే మాత్రం దిమ్మ‌తిరిపోతుంది.

Update: 2024-12-31 19:30 GMT

సెల‌బ్రిటీల లైఫ్ స్టైల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. డైలీ యోగా, జిమ్, న్యూట్రీష‌న్, డైటీష‌న్లు ఇచ్చిన డేటా ఆధారంగా పుడ్ తీసుకుంటారు. మ‌హేష్ దాదాపు శాఖాహార‌మే. అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే ఇష్ట‌మైన చికెన్ బిర్యానీ తీసుకుంటారు. తిన్న ఒక్క రోజు చెమ‌ట‌లు గ‌క్కుతాన‌ని చెప్పిన సంద‌ర్భాలెన్నో. రామ్ చ‌ర‌ణ్ కూడా దాదాపు మ‌హేష్ లాగే డైట్ ప్లాన్ ఉంటుంది. ఎన్టీఆర్, ప్ర‌భాస్ లు నాన్ వెజ్ ప్రియులు. హీరోయిక్ లుక్ కోసం అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే నాన్ వెజ్ తీసుకుంటున్నారు.

మ‌రి యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య డైట్ ఎంత మందికి తెలుసు? తెలిస్తే మాత్రం దిమ్మ‌తిరిపోతుంది. డైలీ నాగ‌చైత‌న్య మెనూ ఇలా ఉంటుంది. 80 గ్రాముల‌ రైస్ లేదా ఆమ్లేట్ తీసుకుంటాడుట‌. అలాగే 100 గ్రాముల‌ పైబ‌ర్ ప‌దార్ద‌లు త‌ప్ప‌ని స‌రిగా ఉండేలా చూసుకుంటారు. 120 గ్రాముల ప్రోటీన్ కూడా అంతే అవ‌స‌రం అంటున్నాడు. దీనిలో భాగంగా చికెన్ లేదా ఫిష్ త‌ప్ప‌ని స‌రిగా ఉండేలా చూసుకుంటాడట‌. దాదాపు రోజు నాగ‌చైత‌న్య ఇలాగే పుడ్ తీసుకుంటాడుట‌.

ఒక్క గ్రాము కూడా త‌క్కువ కాకుండా..ఎక్కువ‌గా కాకుండా ప‌క్కా కొల‌త‌తో తీసుకుంటాడుట‌. తాను అంత స‌న్నగా ఉండ‌టానికి కార‌ణం అదేన‌న్నారు. అలాగే డైలీ జిమ్ త‌ప్ప‌న‌స‌రి అంటున్నాడు. ఇష్ట‌మైన ఆహారాల్లో ముద్ద‌ ప‌ప్పు ఆవ‌కాయ కాంబినేష‌న్ అంటే బాగా తింటాడుట‌. ఆ కాంబినేష‌న్ ఉంటే మాత్రం ఆ రోజు డైట్ ప్లాన్ అంటూ ప్ర‌త్యేకంగా ఉండ‌ద‌ని అంటున్నాడు. నాన్ వెజ్ ఇష్ట‌మైనా నాన్ అరుదుగానే తీసుకుంటాడుట‌.

అలాగే నాగ‌చైతన్య స‌తీమ‌ణి శోభిత అయితే పూర్తిగా వెజిటేరియ‌న్. చిన్న‌ప్ప‌టి నుంచి నాన్ వెజ్ అల‌వాటు లేద‌ని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. వీరిద్ద‌రు ఇటీవ‌ల ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక నాగ‌చైత‌న్య వ‌చ్చే ఏడాది `తండేల్` అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు.

Tags:    

Similar News