శోభిత సినిమాల్లో ఆ రెండూ బాగా ఇష్టం: నాగ చైతన్య
తన తాజా సినిమా తండేల్ ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య ఆయన భార్య శోభిత గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నాడు.
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాల గతేడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకుని ఒకటైన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తన తాజా సినిమా తండేల్ ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య ఆయన భార్య శోభిత గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నాడు.
శోభాతది వైజాగ్. ఇద్దరిదీ ఆంధ్ర బ్యాక్ గ్రౌండేనని, అందుకే ఇద్దరి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ కలిశాయన్నారు. చాలా మంది ఆమెను చూసి శోభితకు తెలుగు రాదనుకుంటారు. కానీ శోభిత ఎంతో అద్భుతంగా తెలుగు మాట్లాడుతుందని, భాష విషయంలో తనకు చాలా సాయం చేస్తుందని, ఏదైనా ఈవెంట్ లో తాను మాట్లాడాల్సి వస్తే శోభితనే హెల్ప్ చేస్తుంటుందని చైతూ తెలిపాడు.
శోభిత నటించిన సినిమాల్లో మేడ్ ఇన్ హెవెన్, మేజర్ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన చైతన్య ఇంతకుముందు కూడా శోభితపై తన ఇష్టాన్ని తెలియచేశాడు. శోభిత చాలా కరెక్ట్ గా ఆలోచిస్తుందని, తాను అయోమయంలో ఉన్నప్పుడు ఆమె ఇచ్చే సపోర్ట్ తో వెంటనే తాను నార్మల్ అవుతానని చెప్పిన చైతన్య ఆమెను ఇంట్లో ప్రేమగా బుజ్జితల్లి అని పిలుస్తానని, ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాతే ఏదైనా చేస్తానని చెప్పాడు.
అంతేకాదు, శోభిత మన కల్చర్‌ను ఎంతో గౌరవిస్తుందని, ప్రతీ సంప్రదాయాన్ని ఆమె ఫాలో అవుతుందని, తమ పెళ్లికి సంబంధించిన ప్రతీదీ ఆమె డిజైన్ చేసిందేనని, ఫ్యామిలీతో కలిసి గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తన భార్యను పొగడ్తలతో ముంచెత్తాడు నాగ చైతన్య.
ఇక తండేల్ విషయానికొస్తే నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలో చైతూ సరసన జోడీగా సాయి పల్లవి నటించింది. యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని చందూ మొండేటి తండేల్ ను తెరకెక్కించాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించిన ఈ సినిమాను బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మించాడు. తండేల్ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.