చైతూ రేసింగ్ టీమ్.. బిహైండ్ ద సీన్స్ ఇలా..

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య రీసెంట్ గా కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

Update: 2024-09-16 08:48 GMT

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య రీసెంట్ గా కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇండియన్ రేసింగ్ లీగ్ లో బరిలోకి దిగుతున్న హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసి లీగ్ లో భాగస్వామిగా మారారు. అయితే సెప్టెంబర్ 24వ తేదీ నుంచి రేసులు స్టార్ట్ కానున్నాయి. దీంతో చైతూ ఫ్రాంచైజీ ఎలాంటి ప్రతిభ చూపిస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు.

నిజానికి నాగచైతన్యకు కార్ రేసింగ్స్ అంటే చాలా ఇష్టం. ఫార్ములా వన్ అంటే ఇంకా ఇష్టం. ఆ కార్ రేసింగ్స్ ను చూసేందుకు ప్రతి సీజన్ కు అటెండ్ అవుతుంటారు. అంతే కాకుండా.. తనకు ఇష్టమైన రేసింగ్ కార్లు, బైకులు కొనుగోలు చేస్తూంటారు. కుదిరినప్పుడు రేసింగ్ లో కూడా పాల్గొంటారు. ఆ మక్కువతో రేసింగ్ రంగంలోకి అడుగు పెట్టారు. హైదరాబాద్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్నారు. మరో ఐదు ఫ్రాంఛైజీలతో పోటీ పడనున్నారు.

అయితే ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఇప్పటికే చైతూ తెలిపారు. రేసులో తన టీమ్ కు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. తనకున్న ప్యాషన్ ను ఈ వేదిక ద్వారా చూపించుకునే అవకాశం ఉందని తెలిపారు. అక్కినేని వారసుడు తమ రేసింగ్ లీగ్ లో భాగం కావడం వల్ల ప్రేక్షకాదరణ పెరుగుతుందని నిర్వాహకులు అంచనా వేశారు. అదే సమయంలో స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

అందులో నాగచైతన్య.. గెట్ రెడీ అంటూ హుషారు పెంచారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ తో ముందుకు వస్తున్నట్లు తెలిపారు. చైతూ రేసింగ్ బిట్స్ ను కూడా నిర్వాహకులు చూపించారు. అందుకు సంబంధించిన బిహైండ్ ద సీన్స్ వీడియో ఇప్పుడు రిలీజ్ చేశారు. అందులో చైతూ వేరే లెవెల్ లో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో ర్యాప్ డైలాగ్ తో వీడియో అదిరిపోయింది. హైదరాబాద్ ఫ్రాంచైజీ కారు ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివల్ లో మొత్తం ఆరు టీమ్స్ పోటీ పడనున్నాయి. హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్‌తో పాటు కోల్‌క‌తా రాయ‌ల్ టైగ‌ర్స్‌, చెన్నై ట‌ర్బో రైడ‌ర్స్‌, స్పీడ్ డెమోస్ దిల్లీ, గోవా ఏసెస్ జేఏ, బెంగ‌ళూరు స్పీడ్‌ స్ట‌ర్స్‌ బ‌రిలో దిగ‌నున్నాయి. కోల్‌క‌తా రాయ‌ల్ టైగ‌ర్స్ కు భారత మాజీ క్రికెట‌ర్‌ సౌర‌భ్ గంగూలీ, గోవా ఏసెస్ కు జాన్ అబ్ర‌హ‌మ్, స్పీడ్ డెమోస్ దిల్లీకి అర్జున్ క‌పూర్‌ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. మరి చైతూ ఫ్రాంఛైజీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News