#ChaySo: నాగ చైతన్య - శోభిత పెళ్లి ట్యాగ్ సో క్యూట్
ఇప్పుడు నాగచైతన్య- శోభిత ధూళిపాల పెళ్లి సందర్భంగాను #ChaySo అనే క్లాసీ హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారుతోంది.
ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ పెళ్లి సమయంలో #ప్రియానిక్ ట్యాగ్ జోరుగా వైరల్ అయింది. ఈ ట్యాగ్ గ్లోబల్ వైడ్ చాలా ఫేమస్.. అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ జంట కోసం #విరుష్క ట్యాగ్ ట్రెండ్ అయింది. దీపిక-రణవీర్ సింగ్ పెళ్లి సమయంలోను #దీప్ వీర్ ట్యాగ్ వైరల్ అయింది. సెలబ్రిటీ జంటల వివాహ సమయాల్లో ట్యాగులను వైరల్ చేయడం.. వాటి ద్వారా చేరవేయాల్సిన సమాచారాన్ని చేరవేయడం చాలా గమ్మత్తయిన విషయం.
ఇప్పుడు నాగచైతన్య- శోభిత ధూళిపాల పెళ్లి సందర్భంగాను #ChaySo అనే క్లాసీ హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారుతోంది. ఈ జంట పెళ్లికి అధికారికంగా వివాహ ఆహ్వానం అందింది. శుభలేఖతో గూడీస్ బాస్కెట్ ఇప్పటికే వైరల్‌గా మారాయి సెలబ్రిటీల విషయానికి వస్తే భారీ వివాహ ప్రక్రియలో నెలల తరబడి మీడియా ప్రచారం ఉంటుంది. నాగ చైతన్య- శోభితా ధూళిపాళ డిసెంబర్లో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థ సమయం నుంచి ఈ జంటపై మరింత ప్రచారం హోరెత్తింది. ఇప్పుడు వారి వివాహ ఆహ్వాన పత్రిక మీడియాలో వైరల్ అయింది.
వివాహ ఆహ్వానం అతిథులకు గూడీస్‌తో నిండిన బుట్టతో అందంగా కనిపించింది. వీటిలో బట్టలు, పువ్వులు, ఆహారం ఉన్నాయి. తెలుగింటి వివాహ సాంప్రదాయానికి ఈ శుభలేఖ చిరునామాలాగా కనిపించింది. వెడ్డింగ్ కార్డ్ లో 4 డిసెంబర్ 2024 తాళి కట్టు ముహూర్తాన్ని వెల్లడించింది. ఈ వేడుక హైదరాబాద్‌లోని అక్కినేని స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది.
శోభిత ఇంటి వద్ద ప్రీ వెడ్డింగ్ వేడుక తెలుగు సాంప్రదాయంలో అందంగా మొదలైంది. అందుకు సంబంధించిన ఫోటోలను వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి షాపింగులు వగైరా వగైరా పూర్తయ్యాయి. ఇక డిసెంబర్ లో సంబరంగా పెళ్లి వేడుకను జరుపుకోనున్నారు. ఏడాదికి పైగా డేటింగ్ తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ప్రైవేట్ వేడుకలో చై-శోభిత జంట నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లికొడుకు తండ్రి నాగార్జున అక్కినేని శోభిత కుటుంబానికి స్వాగతం పలుకుతూ నిశ్చితార్థాన్ని ప్రకటించారు. నాగ చైతన్య ఇన్‌స్టాలో శోభితతో సెల్ఫీని పోస్ట్ చేయడంతో మొదటి ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డును అందజేస్తున్న సమయంలోను శోభిత- నాగచైతన్య జంట వేదికపై సందడిగా కనిపించారు.