పెరుగుతున్న తండేల్ క్రేజ్.. బడా సంస్థ చేతికి తమిళ్ రైట్స్!
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'తండేల్' సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న విషయం.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'తండేల్' సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న విషయం. చైతన్యకు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చే చిత్రంగా ఇది నిలుస్తుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నేటివిటీతో పాటు యూనివర్సల్ టచ్‌ను హైలెట్ చేసే విధంగా దేశానికి సంబంధించిన ఎమోషనల్ కంటెంట్ ఉండబోతోంది.
మంచి ప్రేమ కథ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు ఇదివరకే బుజ్జితల్లి పాట ద్వారా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమా దర్శకుడు చందు ఇదివరకే పాన్ ఇండియా రేంజ్ లో కార్తికేయ 2 సినిమాతో మంచి క్రేజ్ అందుకున్నాడు. పైగా నాగచైతన్య - సాయి పల్లవి కాంబినేషన్ తో సినిమాపై అన్ని వర్గాల ఆడియెన్స్ లో హైప్ పెరిగింది. పాము ఇండియా మార్కెట్ లో తప్పకుండా ఈ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేయనుంది.
లేటెస్ట్, ఈ చిత్రం తమిళనాట కూడా అత్యంత గ్రాండ్‌గా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ ప్రకటన తమిళ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచింది.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఇప్పటికే భారీ సినిమాలతో కోలీవుడ్ లో మంచి సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రొడక్షన్ నుంచి ఏ సినిమా వచ్చినా అందులో మంచి కంటెంట్ ఉంటుంది అని జనాల్లో నమ్మకం ఏర్పడింది. ఇక తండేల్ కూడా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా కాబట్టి ఆ సంస్థ భారీ ధరకు సినిమా రిలీజ్ హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే చైతన్య తమిళ్ మార్కెట్‌లో బలమైన అడుగు పెట్టడానికి ఇది మంచి అవకాశం అని చెప్పాలి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండటంతో పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. ప్రత్యేకంగా, సినిమా కథ పశ్చిమ ఆంధ్రా తీరప్రాంతం నేపథ్యంతో ఉండటం సినిమాకు మరో కీలక ఆకర్షణగా నిలుస్తుంది. చైతన్య పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. పైగా తమిళ ఆడియెన్స్ కు కూడా ఈ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాగచైతన్య కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుందని అర్ధమవుతుంది.
'తండేల్' విడుదల తేదీ ఫిబ్రవరి 10గా ఖరారు చేయడంతో, ప్రమోషన్ల జోరు మరింత పెరిగింది. తమిళనాట కూడా ఈ సినిమా మాంచి స్పందన పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాపై నిర్మాతలు గీతా ఆర్ట్స్ 2 భారీగా నమ్మకంతో ఉన్నారు. నాగ చైతన్య కెరీర్‌లో ఇదో కీలక సినిమా నిలుస్తుందనే నమ్మకంతో చిత్ర బృందం పని చేస్తోంది. తమిళ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా స్వాగతిస్తారో చూడాలి.