తండేల్ శివరాత్రి స్పెషల్ సాంగ్.. నెవ్వర్ బిఫోర్ అనేలా..

'యువ సామ్రాట్' నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ తండేల్ భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది.

Update: 2024-09-30 05:46 GMT

'యువ సామ్రాట్' నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ తండేల్ భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా డి.మచిలేశం గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.


ఈ కథనం సరికొత్తగా, ఉత్కంఠభరితంగా సాగుతుందని మేకర్స్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేకించి ఈ చిత్రంలో ఇద్దరు ప్రేమికుల మధ్య చుట్టూ తిరిగే కథాంశం ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉంటుందని చిత్రయూనిట్ చెబుతోంది. ఇక సినిమాలో కీలక ఘట్టం అయిన శివరాత్రి సాంగ్ కోసం చిత్రబృందం ప్రత్యేకమైన ప్లాన్ వేసింది.

శ్రీ ముక్కాళింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహా శివరాత్రి ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని, అనేక మంది కళాకారులతో ఎంతో అద్భుతంగా సాంగ్ ని తెరకెక్కించారు. శివరాత్రి పాటలో నందికేశ్వరుడికి జరిగే భజనలు, శివపార్వతుల ఆరాధనను సొగసైన సెట్‌లతో, గొప్ప నేపథ్య సంగీతంతో తెరపై ఆవిష్కరించారని తెలుస్తోంది.

అనేక రకాల జానపద కళలతో పాటను అలంకరించి, వెయ్యి మందికిపైగా డ్యాన్సర్స్ తో సాంగ్ చిత్రీకరణ జరిగింది. ఈ సాంగ్‌లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా అలరించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట క్లాసిక్ గా నిలవనుందని యూనిట్ భావిస్తోంది. శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించిన ఈ సాంగ్, చైతన్యకు కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన పోస్టర్లు కూడా సినిమాపై హైప్‌ను మరింతగా పెంచాయి. ముఖ్యంగా శివుడి విగ్రహం ముందు, పురాతన శైవాలయంలో తీసిన సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ, వెయ్యి మందికిపైగా నర్తకుల మధ్య సాంగ్‌లో అదరగొట్టారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా కోసం హీరో నాగచైతన్య ప్రత్యేకంగా వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నాడు. డైలాగ్ డెలివరీ దగ్గరి నుంచి నటన వరకు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండేలా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నాడు. నాగచైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా తండేల్ నిలుస్తుందని నిర్మాత బన్నీ వాసు ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News