సీఎంని కలవాలా? లేదా? అన్నది రాజుగారు డిసైడ్ చేస్తారా!
ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ పై సీరియస్ అవ్వడం...ప్రాణాలు పోతున్నా యంటే సినిమా వాళ్ల విషయంలో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
సంధ్య థియేటర్ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే. తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా సన్నివేశం ఒక్కసారిగా హీటెక్కింది. 'పుష్ప-2' థియేటర్లో రిలీజ్ అయిన నాటి నుంచే ఇదే చర్చ జరుగుతోంది. ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ పై సీరియస్ అవ్వడం...ప్రాణాలు పోతున్నా యంటే సినిమా వాళ్ల విషయంలో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
బాధిత కుటుంబీకుల్ని ఇండస్ట్రీ నుంచి పరామర్శిచంలేదని..బన్నీ ఇంటికి మాత్రం క్యూ కట్టారని అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సినిమాలకు సంబంధించిన అనుమతులు, టికెట్ ధరల వ్యవహారం ఇకపై ప్రభుత్వం వైపు నుంచి తగ్గేదేలే అన్నట్లు రేవంత్ హింట్ ఇచ్చారు. దీంతో సంక్రాంతి సినిమాల రిలీజ్ ల విషయలో పంచ్ పడుతుందనే ప్రచారం పీక్స్ లో జరుగుతుంది.
ప్రభుత్వం నిర్దారించిన ధరకే టికెట్లు అమ్మాల్సి ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా 'డాకు మహారాజ్' చిత్రం ప్రచారంలో భాగంగా నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇండస్ట్రీ వారంతా మళ్లీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచనలో ఉన్నారా? అనే ప్రశ్నత తలెత్తింది. దీనికి నాగవంశీ ఇలా స్పందించారు.
'ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు గారు అమెరికాలో ఉన్నారు. మా సినిమా కంటే ముందే ఆయన సినిమా రిలీజ్ కి ఉంది. ఆయన సినిమాకి టికెట్ ధరలు పెరిగితే మావి పెరుగుతాయి. రాజుగారు హైదరాబాద్ కు రాగనే అంతా చర్చించు కుని ఓ నిర్ణయం తీసుకుంటాం' అన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డిని కలవాలా? లేదా? అన్నది రాజుగారు ఇండియాకి వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది. దిల్ రాజు నిర్మించిన 'గేమ్ ఛేంజర్' జనవరి 10న రిలీజ్ అవుతుంది. 'డాకు మహారాజు' రెండు రోజుల వ్యవధిలో 12వ తీదిన రిలీజ్ అవుతుంది.