దబిడి దిబిడి ట్రోల్స్.. సినిమాకు ప్లస్ అయినట్టే..!
సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా ఒక స్టెప్ పై సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ వచ్చింది.
నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఈ నెల 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కించారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా నటించారు. ఐతే ఈ ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ తో పాటు చిట్టి సాంగ్ రిలీజైంది. ఆ రెండు సాంగ్స్ సూపర్ హిట్ కాగా థర్డ్ సాంగ్ గా దబిడి దిబిడి అంటూ రీసెంట్ గా ఒక సాంగ్ వదిలారు. ఈ సాంగ్ లో బాలకృష్ణ, ఊర్వశి రౌతెల స్టెప్పులు వేశారు.
సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా ఒక స్టెప్ పై సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ వచ్చింది. దబిడి దిబిడి సాంగ్ పై కొందరు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. శేఖర్ మాస్టర్ స్టెప్పులతో పాటు హీరో, డైరెక్టర్ ఇలా అందరినీ టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఐతే దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. దబిడి దిబిడి సాంగ్ కేవలం మాస్ ఆడియన్స్ కోసమే అని.. బాలయ్య మాస్ స్టెప్పులే తప్ప తనకు ఎక్కడా వల్గారిటీ కనిపించలేదని అన్నారు నాగవంశీ. థియేటర్ లో ఈ సాంగ్ ని బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు.
సాంగ్ రిలీజ్ టైం లో కొంత నెగిటివిటీ వచ్చిన విషయం తెలుసు కానీ థియేటర్ లో ఈ సాంగ్ అందరికీ నచ్చుతుందని గట్టి నమ్మకంతో చెప్పారు నాగ వంశీ. సో దబిడి దిబిడి సాంగ్ పై నిర్మాత వెర్షన్ ఇది అన్నమాట. ఐతే డాకు మహారాజ్ లోని దబిడి దిబిడి సాంగ్ ట్రోల్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఆల్రెడీ డాకు మహారాజ్ టైటిల్ సాంగ్ తోనే ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమా దబిడి దిబిడి సాంగ్ ట్రోల్స్ తో మరింత జనాల్లోకి వెళ్లింది.
సంక్రాంతికి బాలయ్య సినిమా వస్తే పక్కా హిట్ అన్నట్టే లెక్క. ఈసారి పోటీగా గేం ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వస్తున్నాయి ఈ సినిమాల మధ్య డాకు మహారాజ్ మాస్ ట్రీట్ ఇవ్వనుంది. మరి సంక్రాంతి సినిమాల్లో ఏ సినిమా విజయ పతాకాన్ని ఎగరవేస్తుంది అన్నది చూడాలి. ఇప్పటికే రిలీజ్ అవబోతున్న 3 సినిమాల ట్రైలర్స్ వచ్చేశాయి. ప్రేక్షకులు ఏ సినిమాను ముందు చూసేందుకు ఆసక్తి చూపిస్తారన్నది తెలియాల్సి ఉంది.