నాగ‌బాబు`N`మీడియా భ‌విష్య‌త్ శాటిలైట్ ఛానలా?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఎటాకింగ్ ఎలా ఉంటుంద‌న్న‌ది? చెప్పాల్సిన‌ప‌నిలేదు.

Update: 2024-08-10 09:18 GMT

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఎటాకింగ్ ఎలా ఉంటుంద‌న్న‌ది? చెప్పాల్సిన‌ప‌నిలేదు. ప్ర‌త్యేకంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేసారంటే? నాగ‌బాబు వ‌న్ మ్యాన్ ఆర్మీలా దాడి చేస్తారు. అవ‌త‌ల ప‌దిమంది ఉన్నా? ఇవ‌త‌ల ఒక్క నాగ‌బాబు ఉంటే చాలా కౌంట‌ర్లు ప‌డిపోతుంటాయి. పార్టీపై వచ్చే విమ‌ర్శ‌ల్ని త‌న‌దైన శైలిలో తిప్పికొట్ట‌డం నాగ‌బాబు స్పెషాల్టీ. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న గ‌ళాన్ని వినిపిస్తుంటారు.

ఫేస్ బుక్, ఇన్ స్టా, ఎక్స్, యూట్యూబ్ వంటి మాధ్య‌మాల ద్వారా రంగంలోకి వ‌స్తుంటారు. ముఖ్యంగా త‌న యూ ట్యూబ్ ఛానెల్ బాగా పాపుల‌ర్ అయింది. త‌న అభిప్రాయాల‌న్నింటిని త‌న సొంత యూబ్యూట్ ద్వారానే చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. సినిమా ప్ర‌మోష‌న్ల‌కు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆ యూట్యూబ్ ఛానెల్ ని వినియోగిస్తుంటారు. అయితే తాజాగా నాగ‌బాబు `N` మీడియా పేరుతో మ‌రో ఛాన‌ల్ రెడీ చేస్తున్నారు.

ఛానెల్ కి సంబంధించిన లోగోను కూడా ఆవిష్క‌రించారు. అయితే ఇది కేవ‌లం ఎంటర్టైన్మెంట్ ఛానెల్ గానే క‌నిపిస్తుంది. న్యూస్ తో పాటు భక్తి న్యూస్, హెల్త్ న్యూస్, పలు ఇంటర్వ్యూలు ప్రేక్షకులకు అందిచ నున్న‌ట్లు రివీల్ చేసారు. ప్ర‌స్తుతానికి కేవ‌లం యూట్యూబ్ ద్వారా మాత్ర‌మే కంటెంట్ అందించ నున్నారు. అయితే భ‌విష్య‌త్ లో ఇదే ఛాన‌ల్ పొలిటికల్ శాటిలైట్ ఛానెల్ అవ్వ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు. దాంతో పాటు ఓ అధికారిక వెబ్ సైట్ కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

అదే జ‌రిగితే అది జ‌న‌సేన మ‌ద్ద‌తుగా మారుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూట‌మి ప్ర‌భుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ర్నీ ఎంత కాలం సాగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. 2029 ఎన్నిక‌ల‌కు ప‌వ‌న్ సింగిల్గా బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. ఈ లోపు పార్టీని బ‌లోపేతం చేసుకోవాలంటే తాను చేసిన సేవ‌లు జ‌నాల్లోకి బ‌లంగా వెళ్లాలి. అలా వెళ్లాలి అంటే సొంత ఛానెల్ అనేది ఒక‌టి కీల‌క‌మే. ఈనేప‌థ్యంలో రానున్న రోజుల్లో ఎన్ మీడియా శాటిలైట్ ఛానెల్ అవ్వ‌డాన‌కి ఛాన్సెస్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

Tags:    

Similar News