టాలీవుడ్ హీరో నాగచైతన్య కేవలం సినిమాలతోనే కాకుండా ఇతర స్పోర్ట్స్ ఈవెంట్స్ లలో కూడా రెగ్యులర్ గా పాల్గొంటూ ఉంటాడు. ముఖ్యంగా రేసింగ్ కు సంబంధించిన స్పోర్ట్స్ పై అయితే నాగచైతన్యకు అమితమైన ఆసక్తి ఉంది. ఇక నాగచైతన్య వద్ద ఉన్న కార్ కలెక్షన్స్ బైక్ కలెక్షన్స్ కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటాయి. అయితే నాగచైతన్య ఇప్పుడు మరొక ప్రముఖ రేసింగ్ కాంపిటీషన్లో భాగం కాబోతున్నాడు.
హైదరాబాదులో ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా మోటార్‌స్పోర్ట్ రేసింగ్ లీగ్స్ కొనసాగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అందులోకి నాగచైతన్య టీమ్ కూడా ప్రవేశించబోతోంది. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ (HBB) టీం ను నాగచైతన్య కొనుగోలు చేశారు. దీంతో ఈ గేమ్ పై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరింత ఆసక్తి పెరిగింది.
ఇండియన్ రేసింగ్ లీగ్‌లో తనదైన ముద్ర వేసిన HBB జట్టు ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్షిప్ ప్రారంభ సీజన్లో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఈ ఉత్తేజకరమైన కొత్త వెంచర్‌ను రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RPPL) నిర్వహించింది. ఫార్ములా 1, సూపర్కార్స్ మోటార్‌సైకిళ్లను ఎప్పుడూ అమితంగా ఆరాధించే నాగ చైతన్యకు మోటార్‌స్పోర్ట్‌పై కూడా ఎప్పటినుంచో ఆసక్తిని కనబరుస్తున్నాడు.
ఇక ఇన్నాళ్లకు అతను హైదరాబాద్ జట్టుకు యజమానిగా ఉండడం హైలైట్ గా నిలిచింది. సందర్భంగా మాట్లాడిన నాగ చైతన్య మోటార్ స్పోర్ట్స్ లో భాగం కావడం కోసం నేను ఎప్పటినుంచో ఆలోచిస్తున్నాను. హైదరాబాద్ బ్లాక్ బోర్డ్స్ టీమ్ లో ఇప్పుడు భాగమైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ స్పోర్ట్ అయితే చాలామందిని ఇప్పుడు ఆకర్షిస్తోంది. ఇక ప్రతిభావంతులైన చాలామందికి వేదికగా నిలుస్తోంది. ఈ సీజన్ రేసింగ్ కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని అన్నారు.
ఇక ఇండియన్ రేసింగ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన సంవత్సరంలోనే, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ చెప్పుకోదగ్గ విజయం సాధించింది. జట్టులోని ఇద్దరు ప్రముఖ డ్రైవర్లు, అఖిల్ రవీంద్ర మరియు నీల్ జానీ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక RPPL చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అఖిల్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించారు: “భారతదేశంలో మోటార్‌స్పోర్ట్ కోసం మా విజన్‌లో నాగ చైతన్య చేరడం పట్ల మేము సంతోషిస్తున్నాము అని ఇలాంటి స్పోర్ట్ లోకి అవగాహన కలిగిన ఇలాంటి సెలబ్రెటీలు ఒక భాగస్వామి అవ్వడం ఎంతో మంచి విషయమని అన్నారు.