నాగ‌చైత‌న్య‌కు చుక్క‌లు చూపించిన కార్?

తాజాగా జిగ్ వీల్స్ యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో నాగచైత‌న్య త‌న లైఫ్ లో కార్ల‌తో చేదు అనుభ‌వం గురించి ఓపెన‌య్యాడు

Update: 2024-03-24 05:03 GMT

ల‌గ్జ‌రీ బ్రాండ్ కార్ లంటే ప‌డి చ‌చ్చే హీరోల్లో నాగ‌చైత‌న్య ముందు వ‌రుస‌లో ఉంటారు. కింగ్ నాగార్జున వార‌సుడిగా తండ్రి బాట‌లోనే అధునాత‌న సాంకేతిక‌త‌తో ఎప్ప‌టిక‌ప్పుడు మార్కెట్లో దిగే కార్ల‌ను ప‌రిశీలించి కొనుగోలు చేసే అల‌వాటు నాగ‌చైత‌న్య‌కు ఉంది. ఇప్ప‌టికే అత‌డి గ్యారేజ్ లో ఖ‌రీదైన కార్లు కొలువు దీరి ఉన్నాయి. కార్లు కొనేయ‌డం వాటిని గ్యారేజీకి త‌ర‌లించ‌డం స‌రే కానీ.. ఇప్ప‌టివ‌ర‌కూ నాగ‌చైత‌న్య‌ను ఏ కార్ అంత‌గా ఇబ్బంది పెట్ట‌లేదా? అంటే.. దీనికి స‌మాధానం అత‌డే ఇచ్చాడు.

తాజాగా జిగ్ వీల్స్ యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో నాగచైత‌న్య త‌న లైఫ్ లో కార్ల‌తో చేదు అనుభ‌వం గురించి ఓపెన‌య్యాడు. ఓసారి అత‌డు విదేశాల‌లో పాపుల‌ర్ బ్రాండ్ కార్ ఇంజిన్ ని తెచ్చి ఇండియాలో త‌న‌ ల్యాన్స‌ర్ కార్ కి సెట్ చేసాడ‌ట‌. కానీ ఆ త‌ర్వాత చాలా త‌ప్పులు జ‌రిగాయి. ఆ మోడిఫైడ్ కార్ అత‌డికి చుక్క‌లు చూపించింది. కొనుగోలు చేసిన త‌ర్వాత దాని ఇంజిన్ చాలా స‌మ‌స్య‌ల‌ను సృష్టించింది. మైవెక్ అనే ఇంజిన్ ని దీనికోసం అమ‌ర్చారు. అయితే వారం వారం నా జేబు గుల్ల చేసేది ఈ కార్. నా పాకెట్ మ‌నీని కూడా ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి. నిజం చెప్పాలంటే కార్ కొన్న‌దానికంటే రిపేర్ల‌కే ఎక్కువ ఖ‌ర్చు అయ్యేది. ఇదంతా ఏమిటి దేవుడా? అనుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని నాగ‌చైత‌న్య చెప్పాడు.

కార్లంటే క్రేజీగా ఉండే నాగ చైతన్యతో కాలా-కార్‌ టాకింగ్ కార్స్ పూర్తి ఎపిసోడ్ ఇప్పుడు జిగ్‌వీల్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. ఈ వీడియోను యూట్యూబ్ లో వీక్షించ‌వ‌చ్చు. #టాకింగ్ కార్స్ #టాకింగ్ కార్స్‌విత్‌కలాకార్స్ #జిగ్‌వీల్స్ #ఎక్స్‌ప్లోర్‌పేజ్ #ఎక్స్‌ప్లోర్ #ట్రెండింగ్ #కార్‌స్టాగ్రామ్ #నాగచైతన్య #ఫైప్ పేర్లతో హ్యాష్ ట్యాగుల్ని జోడించారు.

నాగ‌చైత‌న్య‌కు పోర్చే లాంటి ల‌గ్జ‌రీ బ్రాండ్ కార్ కూడా ఉంది. ఒక అభిమాని సోష‌ల్ మీడియాలో వ్యాఖ్యానిస్తూ.. మీ కొత్త పోర్స్చే 911 GT3 RS కోసం అభినందనలు అని అన్నాడు. లాన్స‌ర్ కార్ గురించి ప్ర‌స్థావిస్తూ ఒక అభిమాని ఇలా రాసాడు. ''అవును, నాకు లాన్సర్ రాక్షసుడు గుర్తున్నాడు!'' అని రాసాడు.

కార్ల పై చాయ్‌కి ప్రేమ! అంటూ ల‌వ్ ఈమోజీని షేర్ చేసాడు మ‌రో అభిమాని.

కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే నాగచైత‌న్య ప్ర‌స్తుతం చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో 'తండేల్' అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో చైత‌న్య - సాయి ప‌ల్ల‌వి జంట‌గా నటిస్తున్నారు. ఆ ఇద్ద‌రూ పూర్తిగా డీగ్లామ‌ర‌స్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చైత‌న్య కెరీర్ లో ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మిది. త‌దుప‌రి విక్ర‌మ్ కెతో దూత సీక్వెల్లో న‌టిస్తాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అలాగే విరూపాక్ష ద‌ర్శ‌కుడితోను ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక ప్ర‌క‌ట‌న‌లు రావాల్సి ఉంది.

Tags:    

Similar News