చైతన్య కోసం రామ్ అబ్బరాజు కసరత్తులు!
అలాగని చైతన్య యంగ్ మేకర్లని లైట్ తీసుకోవాడం లేదని తాజాగా కొన్ని లీకులు హింట్ ఇస్తున్నాయి
'కస్టడీ' తర్వాత యువ సామ్రాట్ నాగచైతన్య కొత్త సినిమా ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఆయనకు కథలు చెప్పి పలువురు దర్శకులు క్యూలో ఉన్నా! చై ఏ దర్శకుడితో ముందుకెళ్తాడు అన్నది క్లారిటీ లేదు. అయితే రేసులో పాన్ ఇండియా డైరెక్టర్ చందు మొండేటి కనిపిస్తున్నారు. తొలుత ఆయన సినిమానే చై పట్టాలెక్కిస్తారని ప్రచారం సాగుతోంది. చందు సక్సెస్ ఫుల్ కెరీర్ నేపథ్యంలో చైతన్య ఆయనకే ఓటేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అలాగని చైతన్య యంగ్ మేకర్లని లైట్ తీసుకోవాడం లేదని తాజాగా కొన్ని లీకులు హింట్ ఇస్తున్నాయి. ఇటీవలే శ్రీవిష్ణుతో 'సామజవరగమన' అంటూ తొలి హిట్ ని రామ్ అబ్బరాజు ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లని సాధించింది. కంటెంట్ ఉన్న సినిమాగా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ నేపథ్యంలో చైతన్య ఉత్సాహంతో రామ్ అబ్బరాజ్ కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఈ కాంబిని సెట్ చేసే బాధ్యతలు సునీల్ నారంగ్ తీసుకున్నట్లు వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ముగ్గురి మధ్య కథా చర్చలు నడుస్తున్నాయట. స్టోరీ ఒకే అయితే గనుక చైతన్య ఈ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించే అవకాశాలున్నాయని బలమైన సమాచారం.
చందు మొండేటి ప్రాజెక్ట్ తో పాటే సమాంతరంగా రామ్ అబ్బరాజ్ చిత్రాన్ని కూడా ప్రారంభించడానికి ఆస్కారం ఉందని తెలుస్తోంది. బ్యాకెండ్ లో నిర్మాత సునీల్ నారంగ్ కీలక పాత్ర పోషించడంతోనే ఈ కాంబో వెలుగులోకి వస్తోంది.
హీరో కోసం నిర్మాతల మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. హీరోలు కూడా ఏడాదికి ఒక సినిమా కాకుండా రెండు..మూడు సినిమాలు చేసే ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో చైతన్య కూడా స్పీడప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ఒకే అయి సక్సెస్ అయితే గనుక రామ్ అబ్బరాజ్ కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకుంటుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇప్పుడు పెద్దగా సమయం పట్టడం లేదు. బాక్సాఫీస్ ని షేక్ చేసే హిట్ ఇవ్వగలడు అన్న నమ్మకం హీరోలకు కుదిరితే డేట్లు కేటాయించడానికి పెద్దగా సమయం తీసుకోవడం లేదు.