మత్స్యకారుడు రామారావు జీవితంలో చైతన్య!
శ్రీకాకుళం నుంచి గుజరాత్ కి వలస వెళ్లిన రామారావు కుటుంబం కథ స్టోరీ మెయిన్ లైన్ గా తెలుస్తుంది
యువ సామ్రాట్ నాగచైతన్య-చందు మొండేటి ఉత్తరాంధ్ర పర్యటన సంచలనంగా మారిన సంగతి తెలిసిం దే. శ్రీకాకుళం మత్స్య కారుల్ని ఈ ద్వయం కలవడంతో ప్రాజెక్ట్ పై ఆసక్తి సంతరించుకుంది. రాంగో పాల్ వర్మ తరహాలో ఇద్దరు ఎనాలసిస్ కోసం బయల్దేరడం ఇంట్రెస్టింగ్. ఇప్పటివరకూ చైతన్య ఏ సినిమా కోసం ఇలాంటి పర్యటనలు చేసింది లేదు. కేవలం పాత్ర స్వభావం పట్టుకోవడం కోసం..కథపై పట్టు కోసం చైతన్య-చందు ఇలా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఇప్పటికే స్టోరీ లాక్ అయినా..ఎనాలసిస్ అనంతరం స్టోరీలో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. తాజా పర్యటనలో భాగంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇది పూర్తిగా మత్స్య కారులకు..అందులోనూ ఓ కుటుంబానికి చెందిన కథగా తెలుస్తోంది.
2018 లో గుజరాత్ వెరావల్ నుంచి వేటకు వెళ్లి సరిహద్దులు దాటి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ కి చిక్కిన 21 మంది మత్స్యకారుల్లో ఒకరైన రామారావు కథని ప్రధానంగా హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం నుంచి గుజరాత్ కి వలస వెళ్లిన రామారావు కుటుంబం కథ స్టోరీ మెయిన్ లైన్ గా తెలుస్తుంది. వాస్తవానికి మత్స్యకారుల జర్నీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కుటుంబాల్ని వదిలేసి నెలల తరబడి వేటకు అనువైన ప్రాంతాల్లో ఉంటారు. వేట సీజన్ ఉన్నంత కాలం అక్కడే ఉంటారు .ఆ తర్వాత మళ్లీ సొంతూరికి చేరుకుంటారు. జీవన విధానం వెళ్లిన స్థలంలో బాగుంటే అక్కడే స్థిరపడిపోతుంటారు.
ఇప్పటికీ మత్స్య కారుల్లో ఈ విధమైన విధానం అమలులో ఉంది. వీళ్లలో బలమైన ఐకమత్యత ఉంటుంది. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి మరొకరి ప్రాణాలు కాపాడటంలో ముందుంటారు. అలా సముద్ర గర్భంలో కలిసిపోయిన ప్రాణాలెన్నో. రోజుల తరబడి సముద్రంలో ఈదటం వాళ్ల ప్రత్యేకత.
ఇలాంటి సన్నివేశాలు సహా..పాక్ చెరలోఖైదీలుగా బంధిబడ్డ రామారావు కథని హృద్యంగా మలిచే అవకాశం ఉంది.