ఆ యంగ్ హీరో రెండ‌వ పెళ్లి..నిర్ణ‌యం ఆయ‌న‌దా!

చైత‌న్య‌కి న‌చ్చితే అలాంటి పెళ్లి చేయాల‌ని కుటుంబ స‌భ్యులు ఆలోచ‌న చేస్తున్న‌ట్లు వినిపిస్తోంది. మరి చైత‌న్య మ‌న‌సులో ఏముందో? క్లారిటీ రావాల్సి ఉంది.

Update: 2023-09-17 09:03 GMT

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య మ‌ళ్లీ రెండ‌వ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఓ న‌టితో చైత‌న్య ఆ మ‌ధ్య విదేశీ రెస్టారెంట్ లో లో చిక్క‌డంతో! ఆమెనే పెళ్లాడ‌బోతు న్నాడ‌ని మీడియాలో వార్త‌లొచ్చాయి. అయితే అది స్నేహ పూర్వ‌క‌మైన స‌మావేశ‌మా? ప్రేమ పూర్వ‌క‌మైన‌దా? అన్న‌ది క్లారిటీ లేదు. వీటిపై ఏనాడు చైత‌న్య గానీ..అక్కినేని ఫ్యామిలీగానీ క్లారిటీ ఇచ్చింది లేదు.

ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రు మ‌ళ్లీ క‌నిపించింది లేదు. దీంతో కొద్ది రోజులుగా ఈ వ్య‌వ‌హ‌రం నెట్టింట చ‌ల్ల‌బ‌డింది. ఈ నేప‌థ్యంలో చైత‌న్య పెళ్లి విష‌యం ఈసారి తండ్రి నాగార్జున తీసుకున్న‌ట్లు..ఆయ‌నే సినిమాల‌తో ఎలాంటి నేప‌థ్యం లేని కుటుంబం నుంచి పిల్ల‌ని వెతికే ప‌నిలో ప‌డ్డ‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. చైత‌న్య‌కి న‌చ్చితే అలాంటి పెళ్లి చేయాల‌ని కుటుంబ స‌భ్యులు ఆలోచ‌న చేస్తున్న‌ట్లు వినిపిస్తోంది. మరి చైత‌న్య మ‌న‌సులో ఏముందో? క్లారిటీ రావాల్సి ఉంది.

నాగార్జున-అమ‌ల పిల్ల‌ల‌కు కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తారు. పెళ్లి అనేది అనుకుంటే జ‌రిగేది కాదని..ఎవ‌రి జీవితాన్ని ఎప్పుడు ఎలా ముడివేస్తాడు? అన్న‌ది కాలం నిర్ణ‌యిస్తుంద‌న్నది నాగ్ బ‌లంగా న‌మ్ముతారు. అందుకే వ్య‌క్తిగ‌త జీవితంలో ఎవ‌రి నిర్ణ‌యాలు వారే తీసుకునే స్వేచ్ఛ ఉంటుంద‌ని అంటుంటారు. ఈ నేప‌థ్యంలో చైత‌న్య విష‌యంలో నాగ్ ఎలాంటి క‌న్ క్లూజ‌న్ కి వ‌స్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌ర‌మే.

అయితే చైత‌న్య మాత్రం ప్ర‌స్తుతం కెరీర్ పైనే ఫోక‌స్ పెట్టి ప‌నిచేస్తున్నారు. స‌క్సెస్ ల‌ప‌రంగానూ ఈ మ‌ధ్య వెనుక‌బ‌డ్డారు. ప్ర‌స్తుతం సినిమా కెరీర్ పైనే ఎక్కువ ఫోక‌స్ పెట్టారు. దీనిలో భాగంగా చందు మొండేటితో కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే చందు తో క‌లిసి మత్స‌కార ప్రాంతాల్ని సంద‌ర్శించారు. నాగ చైతన్య- సమంతా 2021లో విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News