బిగ్ బాస్ 8 : నాగార్జున ముందు హీరో, జీరో ఫైట్..!

ఈ వారం కంటెస్టెంట్స్ ఆడిన ఆట మీద హోస్ట్ నాగార్జున ఇచ్చే రివ్యూ మీద అటు కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Update: 2024-09-28 12:55 GMT

బిగ్ బాస్ సీజన్ 8 శనివారం మొదటి ప్రోమో వచ్చేసింది. ఈ వారం కంటెస్టెంట్స్ ఆడిన ఆట మీద హోస్ట్ నాగార్జున ఇచ్చే రివ్యూ మీద అటు కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సీజన్ లో నాగార్జున హోస్టింగ్ కూడా అదిరిపోతుంది. ఇక ఈ శనివారం ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. హౌస్ లో హీరో ఎవరు జీరో ఎవరు అంటూ కొత్త మెలిక పెట్టాడు నాగార్జున. కంటెస్టెంట్స్ దృష్టిలో ఈ వారం హీరో ఎవరు.. జీరో ఎవరన్నది నిర్ణయించాల్సి ఉంటుంది. హీరో అనుకున్న వారికి కిరీటం పెట్టాలి జీరో అనుకున్న వారి ముఖం మీద ఎక్స్ మార్క్ వేయాలి.

ప్రోమో మణికంఠ ముందు సీతని హీరోగా కిరీటం పెట్టగా నైనికకు జీరో అనే ఎక్స్ మార్క్ వేశాడు. దానికి నాగార్జున కూడా కరెక్ట్ అని అన్నారు. ఐతే చాలా వరకు మణికంఠ మీద ఎక్స్ మార్క్ వేయగా సీత ఇంకా మిగతా హౌస్ మెట్స్ మీద కిరీటం పెట్టారు. ఐతే ప్రేరణ మాత్రం నిఖిల్ జీరో అని ఎక్స్ మార్క్ వేసింది. దానికి కారణాలు సర్వైవల్ టాస్క్ లో హౌస్ మొత్తం ఆడాల్సింది అతని క్లాన్ వరకు మాత్రమే చూసుకున్నాడని చెప్పింది.

కాంతారా క్లాన్ నుంచి నబీల్ ని తొలగించడం పై తమ అభ్యంతరాలు చెప్పడంతో నిఖిల్ ని నాగార్జున కూడా సర్వైవల్ అర్థం అంటే ఏంటని ప్రశ్నించారు. ఇది నీ నిర్ణయమా లేదా ఎవరైనా ఇచ్చారా అని అడిగారు. అలా మొత్తానికి హౌస్ లో హీరో జీరో అంటూ శనివారం ఎపిసోడ్ కు కావాల్సిన స్టఫ్ ఉందని అనిపించేలా ప్రోమో వదిలారు. వారం మొత్తం కంటెస్టెంట్స్ ఎలా ఎంటర్టైన్ చేసినా వీకెండ్ లో నాగార్జున మాత్రం షో మీద మంచి క్రేజ్ వచ్చేలా చేస్తున్నారు.

ఈ శనివారం నిఖిల్ కి తప్ప మిగతా వారికి పెద్దగా క్లాస్ లేనట్టు ఉంది. ఇక ఆదివారం ఒక ఎలిమినేషన్ ఉంటుంది. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌస్ మెట్స్ ఉన్నారు. వారిలో ఈ వారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8 ఈరోజు ప్రోమో మీరు చూశారా.. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు.. ఆడియన్స్ ను వీకెండ్ ఎపిసోడ్ ఖుషి చేస్తుందా అన్నది చూడాలి.

Full View
Tags:    

Similar News