బిగ్ బాస్ కంటెస్టెంట్ కి నాగార్జున బంపర్ ఆఫర్..!

ఐతే వాటితో పాటు అదనంగా కొన్ని బంపర్ ఆఫర్లు వస్తుంటాయి. అలాంటి ఆఫర్ ఒకటి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ టేస్టీ తేజ కొట్టేశాడు.

Update: 2024-12-16 05:59 GMT

బిగ్ బాస్ సీజన్ 8 ఆదివారం ఎపిసోడ్ తో పూర్తైంది. ఫైనల్ ఎపిసోడ్ కు గ్లోబల్ స్టార్ చీఫ్ గెస్ట్ గా వచ్చి అలరించారు. బిగ్ బాస్ కి వచ్చిన వారికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు రావడం కామనే. ఐతే వాటితో పాటు అదనంగా కొన్ని బంపర్ ఆఫర్లు వస్తుంటాయి. అలాంటి ఆఫర్ ఒకటి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ టేస్టీ తేజ కొట్టేశాడు. బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా ఒక కంటెస్టెంట్ గా వచ్చిన తేజ ఆ సీజన్ లో 9 వారం ఎలిమినేట్ అయ్యాడు.

ఇక సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన తేజ నాలుగు వారాలు హౌస్ లో ఉన్నాడు. ఐతే తేజ హౌస్ లో ఉన్నప్పుడు ఒక వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున వేసుకున్న హుడీ అడిగాడు. దానికి నాగార్జున ముందు నువ్వు నాలాగా సన్నగా మారమని అన్నారు. ఐతే అప్పటి నుంచి తేజ నాగార్జునలా సన్నగా మారాలని ట్రై చేస్తున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ లో కూడా తేజ మరోసారి తన కోరిక బయట పెట్టాడు.

నాగార్జునని తన షర్ట్ ఇవ్వాలని అడగ్గా తేజ వేసుకున్న డ్రెస్ మీద కామెంట్ చేశారు నాగ్. అంతేకాదు నేను వేసుకున్న డ్రస్ కాదు నీ పెళ్లికి మంచి డ్రస్ ని నేనే ఇస్తానని అన్నారు నాగార్జున. దానితో తేజ ఉప్పొంగిపోయాడు. మరోపక్క గెస్ట్ గా వచ్చిన చరణ్ కూడా తేజ నీ వీడియోస్ నేను చూస్తానని.. శిరీష్ వీడియో చూశానని అన్నాడు. దానికి కూడా తేజ థాంక్స్ అంటూ ఎమోషనల్ అయ్యాడు.

ఇక సీజన్ 8 లో విన్నర్ గా నిఖిల్, రన్నర్ గా గౌతం నిలిచిన విషయం తెలిసిందే. చివరి వరకు పోటాపోటీగా సాగిన ఈ ఫైట్ లో స్టార్ మా సీరియల్ యాక్టర్ నిఖిల్ విన్నర్ అవ్వడం విశేషం. బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ షీల్డ్ ని చరణ్ చేతుల మీదుగా నిఖిల్ అందుకున్నాడు. ఈ టైటిల్ ని తన మదర్ కి అంకితం చేశాడు నిఖిల్. అంతేకాదు మరోసారి తనని మీ వాడిని అనిపించేలా చేశాడని విన్నింగ్ స్పీచ్ లో చెప్పాడు నిఖిల్. విన్నర్ అయినందుకు ప్రైజ్ మనీతో పాటు 15 వారాల పారితోషికం కూడా నిఖిల్ అందుకోనున్నాడు. రన్నరప్ గౌతం కేవలం 10 వారాల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకోనున్నాడు.

Tags:    

Similar News