చిరు, అమితాబ్ లివింగ్ లెజెండ్స్.. నాగ్ ట్వీట్ వైరల్..

బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య అతిథిగా హాజరై చిరుకు పురస్కారం అందించారు

Update: 2024-10-29 09:20 GMT

ఏఎన్నార్‌ శత వసంతాల వేడుకలు జరుగుతున్న వేళ.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డును ఆయన ఫ్యామిలీ నిన్న అందించిన విషయం తెలిసిందే. సోమవారం హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ లో ఘనంగా నిర్వహించిన వేడుకలో చిరంజీవికి పురస్కారాన్ని ప్రదానం చేసింది. బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య అతిథిగా హాజరై చిరుకు పురస్కారం అందించారు. అందుకు సంబంధించిన పిక్స్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి.


అయితే పురస్కార వేడుకకు హాజరైన చిరంజీవి, అమితాబ్ బచ్చన్ కు మరోసారి సోషల్ మీడియాలో వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నాగార్జున. లివింగ్ లెజెండ్స్ అయిన మీరద్దరి రాకతో వేడుక మరింత ప్రతిష్టాత్మకంగా మారిందని కొనియాడారు. నాన్న గారి జీవితానికి సంబంధించిన విశేషాలతో కీరవాణి ప్రదర్శన ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. అమితాబ్‌, చిరంజీవితో సరదాగా

మాట్లాడుతున్న ఫొటోలను షేర్ చేశారు.

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నిర్వహించిన వజ్రోత్సవాల్లో లెజెండ్ ఆఫ్ తెలుగు సినిమా పురస్కారంతో చిరును సత్కరించాలనుకున్న విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. నిన్నటి వేడుకలో చిరంజీవి ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు తన ట్వీట్ లో లివింగ్ లెజెండ్స్ అంటూ చిరు, అమితాబ్ ను సంబోధించడంతో నాగార్జున పోస్ట్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

అయితే ఏఎన్నార్‌ అవార్డు వేడుకపై చిరంజీవి, అమితాబ్‌ కూడా పోస్టులు పెట్టారు. ఏఎన్నార్‌ శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించానని బిగ్ బి తెలిపారు. గొప్ప వేడుకలో తనను భాగం చేసినందుకు నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. తన చేతుల మీదుగా చిరంజీవికి అవార్డు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతిష్టాత్మకమైన ఏఎన్నార్‌ జాతీయ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని చిరు తెలిపారు.

అమితాబ్‌ చేతుల మీదుగా అందుకోవడం మరింత సంతోషంగా ఉందని వెల్లడించారు. అక్కినేని ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరికీ, అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ మెంబర్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన సినీ జర్నీలో భాగమై.. ప్రతి రికార్డుకు సహకరించిన వారందరికీ ఎంతో రుణపడి ఉంటానని చెప్పి పోస్ట్ చేశారు. ప్రస్తుతం నాగార్జున ట్వీట్ తో పాటు చిరు, బిగ్ పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News