కింగ్ ప్లాన్ అన్నిసార్లు వర్క్ అవుతుందా..?
ఈ సినిమా కేవలం 3 నెలల్లో పూర్తి చేసి ఇండస్ట్రీకి సరికొత్త పాఠం నేర్పారు నాగార్జున.
కింగ్ నాగార్జున నా సామిరంగ సక్సెస్ తో సూపర్ జోష్ లో ఉన్నారు. మన్మథుడు 2 నుంచి ఘోస్ట్ వరకు ఫ్లాపులు కాదు డిజాస్టర్స్ తో సావాసం చేస్తున్న నాగార్జునకు మధ్యలో బంగార్రాజు కాస్త ఊరట ఇచ్చినా మళ్లీ తిరిగి తన మార్క్ హిట్ కొట్టే సినిమా కోసం ఎదురుచూశాడు. సరిగ్గా అలాంటి సినిమానే నా సామిరంగతో పడింది. సంక్రాంతికి సినిమాల మధ్య పోటీ భారీగానే అనిపించినా సైలెంట్ గా వచ్చి హిట్ ఖాతాలో వేసుకున్నాడు నాగార్జున.
ఈ సినిమా కేవలం 3 నెలల్లో పూర్తి చేసి ఇండస్ట్రీకి సరికొత్త పాఠం నేర్పారు నాగార్జున. ఇదిలాఉంటే నా సామిరంగ సక్సెస్ మీట్ లో భాగంగా నాగార్జున మళ్లీ వచ్చే సంక్రాంతికి కూడా కలుద్దామని అన్నారు. అంటే సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకోవాలని నాగార్జున స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టు ఉన్నారు. సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా చేస్తే ఆడియన్స్ హిట్ చేస్తారని 3 సార్లు ప్రూవ్ చేసిన నాగార్జున. ఇదే పంథా రానున్న సంక్రాంతికి కొనసాగించాలని చూస్తున్నారు.
డిఫరెంట్ కథలతో వెరైటీ ప్రయత్నాలు చేసే కన్నా తనను ఆడియన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాంటి కథలు పాత్రలతో సినిమాలు చేస్తే బెటర్ అని నాగార్జున ఫిక్స్ అయ్యారు. అందుకే అసలు కనీసం మొదలు పెట్టని సినిమా గురించి రిలీజ్ మాత్రం సంక్రాంతికే అని చెప్పేశారు. అయితే నాగార్జున ప్లాన్ అన్నిసార్లు వర్క్ అవుట్ అవుతుందా అన్న డౌట్ రేజ్ అవుతుంది. సంక్రాంతికి పండుగ లాంటి సినిమాతో వస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. కానీ అది అన్నిసార్లు జరుగుతుందని చెప్పడం కష్టం. అదీగాక 2025 సంక్రాంతికి శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అని ఆ సినిమా సీక్వెల్ రిలీజ్ ప్రకటించారు దిల్ రాజు. సో నెక్స్ట్ సంక్రాంతి ఫైట్ అంత ఈజీ ఏం కాదని చెప్పొచ్చు.
నాగార్జున మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మళ్లీ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. సోగ్గాడే చిన్ని నాయనాతో మొదలైన ఈ సంక్రాంతి హిట్ సెంటిమెంట్ బంగార్రాజుతో కొనసాగించి నా సామిరంగతో హ్యాట్రిక్ అందుకున్నారు. ఈ హిట్ కిక్ బాగా ఎంజాయ్ చేస్తున్న కింగ్ నాగార్జున అందుకు తగినట్టుగానే నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇంతకీ నాగార్జున నెక్స్ట్ సినిమా ఏంటి..? డైరెక్టర్ ఎవరు..? ఇలాంటి వాటికి ఆన్సర్ దొరకాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.