చిరు సై అన్నారనే కింగ్ కూడా సైసై !
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' కోసం త్రిషని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 'స్టాలిన్' తర్వాత ఇద్దరు జోడీ కట్టడం ఇదే కావడం విశేషం
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' కోసం త్రిషని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 'స్టాలిన్' తర్వాత ఇద్దరు జోడీ కట్టడం ఇదే కావడం విశేషం. అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత చిరు-త్రిష జోడీని తెరపై చూడబో తున్నాం. మరి చిరంజీవి అలాంటి ఛాన్స్ తీసుకున్న తర్వాత స్నేహితుడు నాగార్జున ఏమైనా తగ్గుతారా? అయన కూడా ఇప్పుడు స్నేహితుడి మార్గంలో వేళ్తున్నట్లు కనిపిస్తోంది.
అంటే చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు నాగార్జున కూడా మళ్లీ త్రిషని ఎంపిక చేస్తున్నారని అనుకునేరు. అది కాదు మ్యాటర్. ఆ ఛాన్స్ కింగ్ ఇస్తుంది ప్రియమణికి అని తెలిసింది.' నా సామిరంగ' తర్వాత నాగార్జున వరుసగా ప్రాజెక్ట్ లు లైన్ లోకి తెస్తోన్న సంగతి తెలిసిందే. ధనుష్ సినిమా పక్కనబెడితే కింగ్ సోలోగా తమిళ డైరెక్టర్ నాగ్ తో ఓ సినిమా..సుబ్బు అనే దర్శకుడితో మరో సినిమాకి కమిట్ అయ్యారు.
ఇందులో సుబ్బు సినిమా కోసం హీరోయిన్ గా ప్రియమణిని ఎంపిక చేస్తున్నారని లీకులందుతున్నాయి. ప్రియమణి ఎంట్రీ ఖరారైతే 14 ఏళ్ల తర్వాత కింగ్-ప్రియమణి జోడీని తెరపై చూస్తున్నట్లే. గతంలో వీళ్లిద్దరు కలిసి 'రగడ' సినిమాలో నటించారు. 2010 లో రిలీజ్ అయిన ఆ చిత్రంలో అనుష్క మెయిన్ లీడ్ కాగా..ప్రియమణికి సెకెండ్ లీడ్ ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదనుకోండి.
అయితే ట్యాలెంటెడ్ ప్రియమణి ప్రతిభని మెచ్చి కింగ్ మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ప్రియమణి మళ్లీ ఫామ్ లోకి వస్తున్నట్లే కనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో పాత్రలకు ఆమెకి మంచి గుర్తింపును తీసుకొస్తున్నాయి. చిన్న చిన్న పాత్రలైనా? ఉన్నంత సేపు అమ్మడు మార్క్ పెర్పార్మెన్స్ తో అదరగొట్టేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ నేపథ్యంలో నాగ్ మరోసారి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అవకాశాలిచ్చి ప్రోత్సహించడంలో నాగ్ ముందుంటారు. బంగార్రాజు కోసం రమ్యకృష్ణకి అలాగే అవకాశం కల్పించారు. ఇప్పుడు ప్రియమణికి లిప్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది.