సోలో సెంచరీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి..నటసింహ బాలకృష్ణ..విక్టరీ వెంకటేష్ వందకోట్ల క్లబ్ లో చేరిపోయారు
సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి..నటసింహ బాలకృష్ణ..విక్టరీ వెంకటేష్ వందకోట్ల క్లబ్ లో చేరిపోయారు. బాలయ్య..చిరంజీవి ఏ సినిమా చేసినా వందకోట్లు గ్యారెంటీ అనే మాట మార్కెట్ బలంగా వినిపిస్తుంది. కానీ కింగ్ నాగార్జున..విక్టరీ వెంకటేష్ మాత్రం ఈ రేసులో బాగా వెనుకబడినట్లే కనిపిస్తుంది. వెంకటేష్ ఆరేళ్ల క్రితం 'గురు' సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టారు. కానీ ఆ తర్వాత ఆయన సోలో విజయం ఏది వంద కోట్లు వసూళ్లు సాధించలేదు.
ఇతర స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన సినిమాలు వంద కోట్ల వసూళ్ల ను సాధించాయిగానీ వెంకీ సోలోగా సత్తా చాటింది లేదు. ఇటీవల రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ 'సైంధవ్' పాన్ ఇండియా లో రిలీజ్ అయిన నేపథ్యంలో 100 కోట్లకు మించి వసూళ్లను సాధింస్తుందని అంచనాలు ఏర్పడ్డాయి గానీ..బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా తొలి షోతోనే చతికలి పడింది. ఆసినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు.
ఇక కింగ్ నాగార్జున సోలోగా సెంచరీ ఓపెనింగ్ కూడా చేయలేదు ఇంతవరకూ. ఇతర స్టార్ హీరోలతో కలిసి నటించని సినిమాలు వంద కోట్ల క్లబ్ లో ఉన్నాయి సోలో సెంచరీ మాత్రం కెరీర్ లో లేనే లేదు. ఆ రకంగా చూసుకుంటే మిగతా ముగ్గురు సీనియర్ల కంటే నాగ్ మరింత వెనుకబడే ఉన్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన 'నా సామిరంగ' సెంచరీ కొడుతుందని భావించారుగానీ 50 కోట్ల వసూళ్లతోనే సరిపెట్టు కోవాల్సి వచ్చింది.
చాలా కాలంగా నాగార్జున నటించిన సినిమాలన్నీ 40-50 కోట్ల మధ్యలోనే సాధిస్తున్నాయి. అంతకు మించి వసూళ్లు మెరుగ్గా కనిపించడం లేదు. ఇది నాగ్ అభిమానుల్ని కాస్త నిరుత్సాహ పరుస్తున్న విషయమే. కింగ్ డిఫరెం ట్ అటెంప్స్ట్ చేస్తున్నా ఫలించడం లేదు. బాలీవుడ్ లో 'బ్రహ్మస్త్ర'లో నటించిన అది పేలవమైన ఫలితమే సాధించింది. ప్రస్తుతం నాగార్జున చేతిలో ఉన్న సినిమాలతోనైనా సెంచరీ కొట్టాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.