'అశ్వత్థామకు ఒక సీటు?'.. నాగి అలా అన్నారేంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే.

Update: 2024-07-05 04:20 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. రిలీజైన అన్ని సెంటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుని దూసుకుపోతోంది. భారీ వసూళ్లు రాబడుతోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ రూపొందించిన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.700 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.

మరికొద్ది రోజుల్లో రూ.1000 కోట్ల క్లబ్ లోకి కల్కి మూవీ చేరడం ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు. అయితే ఈ సినిమా కోసం మాలీవుడ్ టూ బాలీవుడ్.. అనేక మంది నటీనటులను రంగంలోకి దించేశారు మేకర్స్. డైరెక్టర్లు కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. బౌంటీ ఫైటర్ భైరవతోపాటు కర్ణుడి పాత్రల్లో కనిపించారు ప్రభాస్. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ సహా అనేక మంది సందడి చేశారు.

సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్.. అశ్వత్థామగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అశ్వత్థామ రోల్ కు సంబంధించి నాగ్ అశ్విన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమోషన్స్ లో భాగంగా అశ్వత్థామ కోసం థియేటర్లలో ఖాళీ సీటును వదిలేయమని తాను ఎవరినీ అడగలేదని తెలిపారు నాగి. తన కంటెంట్ పై నమ్మకం ఉన్నట్లు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

Read more!

అయితే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రాఫిక్స్, మేకప్స్ విషయంలో అనేక విమర్శలు వచ్చాయి. రివ్యూలు కూడా చాలా నెగిటివ్ గా వచ్చాయి. అయితే మూవీ రిలీజ్ టైమ్ లో ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఒక సీటు వదిలేయమని మేకర్స్ పిలుపునిచ్చారు. దీంతో అన్ని చోట్ల హనుమంతుడి ఫోటో పెట్టి ఒక సీటు వదిలిపెట్టేశారు థియేటర్ యాజమానులు.

ఇప్పుడు కల్కి రిలీజ్ అయ్యాక వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగ్ అశ్విన్.. అలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఇన్ డైరెక్టర్ గా ఓం రౌత్ కు నాగ్ అశ్విన్ కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు చెబుతున్నారు. అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ తర్వాత ఓం రౌత్ పై ఫుల్ ట్రోల్స్ చేశారు సినీ ప్రియులు. ఇప్పుడు నాగ్ అశ్విన్ కామెంట్ తో.. మరోసారి రౌత్ ను ట్రోలింగ్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ అయ్యి ఏడాది అవుతున్నా.. ఇంకా ట్రోల్స్ ఆగనట్లే మరి!

Tags:    

Similar News

eac