మహాభారతంకి ఆయనే పెర్ఫెక్ట్: నాగ్ అశ్విన్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898ఏడీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

Update: 2024-07-05 04:04 GMT

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898ఏడీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించి అందరిని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకొని పోయాడు. దీంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికి కల్కి మూవీ కనెక్ట్ అయ్యింది. ఈ ఏడాదిలో ఇండియన్ బాక్సాఫీస్ పై ఇదే భారీ కలెక్షన్స్ చిత్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే కల్కి చిత్రంలో మహాభారతంలో కురుక్షేత్రం ఎపిసోడ్ ని నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. అందులో అర్జునుడిగా విజయ్ దేవరకొండ, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్, కర్ణుడిగా ప్రభాస్ కనిపించారు. ఈ సీన్ మూవీ ఎంట్రన్స్ లోనే ఉంటుంది. చూపించింది తక్కువ వ్యవధి అయిన కురుక్షేత్రం బ్యాగ్రౌండ్ సెటప్ ని నాగ్ అశ్విన్ చాలా శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత మహాభారతం నాగ్ అశ్విన్ తీస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది.

గతంలో రాజమౌళి మహాభారతంతన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కంప్లీట్ చేసిన అనంతరం మహాభారతంపై జక్కన్న ఫోకస్ చేసే ఛాన్స్ ఉందంట. ఒక వేళ జక్కన్న మహాభారతం మొదలుపెడితే ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా అది మారే అవకాశం ఉంటుంది. అలాగే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా కూడా మహాభారతం సిరీస్ ఉండబోతోంది.

ఇదిలా ఉంటే తాజాగా నాగ్ అశ్విన్ ని మహాభారతం గురించి ఓ ఇంటర్వ్యూలో అడిగారు. మీ సినిమాటిక్ యూనివర్స్ లో మహాభారతం సిరీస్ ని తెరకెక్కించే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. అయితే మహాభారతం మూవీ డైరెక్ట్ చేయడానికి రాజమౌళి పెర్ఫెక్ట్ ఛాయస్ అని నాగ్ అశ్విన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన అయితే మహాభారతంలో ఉండే ఎమోషన్, ఫీల్, రిచ్ నెస్ ని అద్భుతంగా తెరపై ఆవిష్కరిస్తారని అన్నారు.

ఒక అద్భుత ప్రపంచాన్ని చూపించగలరని నాగ్ అశ్విన్ తెలిపారు. తనకి మహాభారతం చేసే ఆలోచన లేదని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కల్కి మూవీ సూపర్ హిట్ దిశగా దూసుకుపోవడంతో నాగ్ అశ్విన్ నెక్స్ట్ కల్కి పార్ట్ 2పైన ఫోకస్ చేశారు. వచ్చే ఏడాది జూన్ లోపు ఈ పార్ట్ 2ని ప్రేక్షకులకి అందించేందుకు సిద్ధం అవుతున్నారు.

Tags:    

Similar News