.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

కల్కి.. నాగఅశ్విన్ టీమ్ సెలక్షన్ క్లిక్ అయినట్లేనా?

అయితే కల్కిని నాలుగేళ్ల క్రితం ప్రాజెక్ట్-K పేరుతో నాగ్ అశ్విన్ అనౌన్స్ చేసినప్పుడు అంతా షాకయ్యారు

Update: 2024-06-29 13:04 GMT

కల్కి 2898 ఏడీ మూవీ కోసం ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. రెండు రోజుల క్రితం రిలీజైన ఆ సినిమా.. నేషనల్ తోపాటు ఇంటర్నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ గా మారింది. భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. హాలీవుడ్ క్రిటిక్స్ కూడా సినిమా చూసి డైరెక్టెర్ నాగ్ అశ్విన్ పనితనాన్ని అభినందిస్తున్నారు. ఆయన టాలెంట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ను ఆయన డీల్ చేసిన విధానాన్ని కొనియాడుతున్నారు.

అయితే కల్కిని నాలుగేళ్ల క్రితం ప్రాజెక్ట్-K పేరుతో నాగ్ అశ్విన్ అనౌన్స్ చేసినప్పుడు అంతా షాకయ్యారు. కానీ ఎవరూ ఊహించని విధంగా సినిమా తెరకెక్కించి ఆశ్చర్యపరిచారు. అదే సమయంలో మూవీ టీమ్ ను కూడా ప్రకటించినప్పుడు అంతా ఆలోచనకు గురయ్యారు. టీమ్ సెలక్షన్ లో భిన్నంగా ఆలోచించారు నాగ్ అశ్విన్. కొత్తకొత్త వాళ్లను టీమ్ లోకి తీసుకున్నారు. ఇండస్ట్రీలో తక్కువ ఫేమ్ ఉన్న టెక్నీషియన్లను నియమించుకున్నారు.

తెలుగు లేదా ఇతర సినీ ఇండస్ట్రీల్లో అనేక మంది స్టార్ సినిమాటోగ్రాఫర్లు ఉన్న విషయం తెలిసిందే. కానీ నాగ్ అశ్విన్ మాత్రం సెర్బియాకు చెందిన జోర్డ్జే స్టోజిల్జ్‌కోవిచ్‌ ను ఎంచుకున్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక విజువల్స్ ను చూస్తే ఆయన నిర్ణయం సరైనదే అనిపించింది. కల్కి మూవీ మంచి హిట్ అవ్వడంలో విజువల్స్ ముఖ్యపాత్ర పోషించాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో ప్రతీ సీన్ కూడా విజువల్ పరంగా అద్భుతమే.

Read more!

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జే మేయర్ ను తొలుత ఎంపిక చేసుకున్నారు నాగ్ అశ్విన్. కానీ ఆ తర్వాత ఆయన ప్లేస్ ను కోలీవుడ్ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ తో రీప్లేస్ చేశారు. దీంతో ఆయన భారీ ప్రాజెక్ట్ కు న్యాయం చేస్తారో లేదోనని అంతా డౌట్ పడ్డారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ఆయన వర్క్ కోసం అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. సినిమాలో ఉన్న

పాటలన్నీ ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ అందుకున్నాయి.

మేకర్స్ కూడా సినిమా రిలీజ్ కు ముందు సాంగ్స్ ను సరిగ్గా ప్రమోట్ చేయలేదు. ఈ విషయంలో నాగ్ అశ్విన్ ఎందుకు లైట్ తీసుకున్నారో తెలియదు కానీ ప్రమోషన్స్ మాత్రం జరగలేదు. సంతోష్ నారాయణ్ కూడా పాటల విషయంలో కాస్త డిస్సపాయింట్ చేసినట్లే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే అందించారు. వేరే లెవల్ లో అవుట్‌ పుట్ ఇవ్వకపోయినప్పటికీ న్యాయం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో లో నాగి సెలక్షన్.. కాస్త మైనస్.. కాస్త ప్లస్ గా నిలిచింది.

Tags:    

Similar News