నాగి అసలు నానీని అడిగాడా లేదా?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి, వీక్ డేస్ లోనూ అనూహ్య స్పందన లభిస్తోంది

Update: 2024-07-03 17:30 GMT

'కల్కి 2898 ఏడీ' సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి, వీక్ డేస్ లోనూ అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే రూ. 625 కోట్లకి పైగా వసూళ్లు సాధించి, ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ కాస్టింగ్ తో పాటుగా, ఊహించని అతిథి పాత్రలు అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాయి. కానీ హీరో నాని క్యామియో ఉంటుందనుకున్న ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశ చెందారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తనకు సన్నిహితంగా ఉండే యాక్టర్స్ ను, గతంలో తన సినిమాల్లో నటించిన నటీనటులను ఏదొక విధంగా 'కల్కి' చిత్రంలో భాగం చేశారు. ఎస్.ఎస్. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కేవీ వంటి దర్శకులతో పాటుగా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్, ఫరియా అబ్దుల్లా, శ్రీనివాస్ అవసరాల.. ఇలా చాలామంది హీరో హీరోయిన్లు క్యామియో అప్పీరియన్స్ ఇచ్చారు. కీర్తి సురేష్ కథలో కీలకమైన భైరవ కారులో ఉండే ఏఐ బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చింది. అయితే నాగితో వర్క్ చేసిన నాని మాత్రం కనిపించలేదు.

Read more!

నిజానికి 'కల్కి 2898 AD' సినిమాలో నేచురల్ స్టార్ నాని కూడా గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు రిలీజ్ కు ముందు రోజు వరకూ వార్తలు వినిపించాయి. నాగ్ అశ్విన్ తో 'ఎవడే సుబ్రమణ్యం' చేసిన నాని.. ఓ స్పెషల్ క్యారక్టర్ పోషించారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ తీరా చూస్తే, ఆయన ఈ మూవీలో ఎక్కడా కనిపించలేదు. దీంతో అతిథి పాత్ర కోసం మేకర్స్ నానీని సంప్రదించలేదా? నాగి అడిగినా క్యామియో చెయ్యడానికి నాని సుముఖత వ్యక్తం చెయ్యలేదా? అనే చర్చలు మొదలయ్యాయి.

డైరెక్టర్ నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ నిర్మాతలు అశ్వినీ దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ లతో నాని చాలా సన్నిహితంగా ఉంటారు. ఇప్పుడు 'కల్కి' లో గెస్ట్ రోల్స్ చేసిన చాలా మంది నటుల కంటే ఎక్కువ క్లోజ్ గా ఉంటారు. అంత దగ్గరి వాళ్ళు అడిగితే నో చెప్పే అవకాశమే లేదు. అందుకనే నాని ఈ సినిమాలో పక్కా కనిపిస్తారని అందరూ భావించారు. కానీ మూవీలో అతను కనిపించకపోవడంతో అనేక రూమర్స్ వస్తున్నాయి.

అతిథి పాత్రల వల్ల తన కెరీర్ కు ఉపయోగపడేది ఏమీ లేదని నాని అనుకున్నారేమో, అందుకే సున్నితంగా తిరస్కరించి ఉండొచ్చని కొందరు అభిమానులు అంటున్నారు. గతంలో నాని గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడానికి వెనకాడలేదు కాబట్టి, ఈసారి ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్లనే నాగ్ అశ్విన్ సినిమాలో నటించడానికి వీలుపడలేదేమో అని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. అసలు కల్కిలో క్యామియో కోసం నానీని అడగలేదేమో అని ఇంకొందరు అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ.. ఒకవేళ నాని ఈ చిత్రంలో అతిథి పాత్ర చేసుంటే అది ఫ్యాన్స్ ను ఎంతో ఎగ్జైట్ చేసే అంశం అయ్యేది.

'కల్కి 2898 AD' చిత్రంలో భైరవగా నటించిన ప్రభాస్.. చివర్లో కర్ణుడిగా కనిపించి అలరించారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుమతిగా దీపికా పదుకునే నటిస్తే.. అర్జునుడిగా విజయ్ దేవరకొండ, ఉత్తరగా మాళవిక నాయర్ కనిపించారు. కృష్ణుడి పాత్రను తమిళ నటుడు కృష్ణ కుమార్‌ పోషించారు. ఇదే క్యారక్టర్ హీరో నాని చేసుంటే బాగుండేదని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు

Tags:    

Similar News

eac