కల్కి.. అసలు సందేహంపై డైరెక్టర్ పర్ఫెక్ట్ ఆన్సర్

కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా 900+ కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగుతోంది

Update: 2024-07-10 06:50 GMT

కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా 900+ కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగుతోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని మరికొద్ది రోజుల్లో కల్కి మూవీ అందుకోబోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినా, అమితాబ్ బచ్చన్ పెర్ఫార్మెన్స్, దీపికా పదుకునే చరిష్మా ఈ సినిమా సక్సెస్ లో కీలక భూమిక పోషించాయి. అలాగే మూవీ కథాంశం కూడా మైథాలజీ టచ్ తో సైన్స్ ఫిక్షన్ గా ఉంది.

ఇలాంటి జోనర్ లో మొదటిసారి ఇండియన్ ఆడియన్స్ సినిమా చూడటంతో కల్కి మెజారిటీ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా విషయంలో ప్రేక్షకుల నుంచి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. సినిమా నిడివి 3 గంటలకి పైగా ఉంది. దీంతో కొన్ని సీక్వెన్స్ మరీ సాగదీసినట్లు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. అనవసరమైన సన్నివేశాలు కూడా కథాంశంలో ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

అలాగే దిశాపటాని క్యారెక్టర్ సినిమాలో అనవసరంగా పెట్టారంటూ కామెంట్స్ వినిపించాయి. తాజాగా నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో వీటికి క్లారిటీ ఇచ్చారు. సినిమా నిడివి, రన్ టైం విషయంలో వచ్చిన విమర్శలని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అయితే క్యారెక్టర్స్ వరల్డ్ బిల్డింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకోవడం జరిగింది. ఈ కారణంగా లెంత్ వచ్చిందని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. అలాగే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కి మరో నెల రోజులు సమయం దొరికి ఉంటే కచ్చితంగా రన్ టైం తగ్గేదని అన్నారు.

విమర్శలని కూడా తనకు సానుకూలంగా తీసుకుంటానని, అందులో ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని పరిగణంలోకి తీసుకుంటానని అన్నారు. కల్కి పార్ట్ 2 విషయంలో ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడతానని నాగ్ అశ్విన్ చెప్పారు. ఈ రోజు కల్కి మూవీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యిందని. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉందని అన్నారు.

తాము చెప్పాలనుకున్న పాయింట్ అయితే కల్కి సినిమా ద్వారా ఆడియన్స్ కి రీచ్ అయ్యిందని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. రన్ టైం విషయంలో నాగ్ అశ్విన్ ఇచ్చిన క్లారిటీ ఆమోదయోగ్యంగానే ఉందనే మాట వినిపిస్తోంది. సినీ విశ్లేషకులకి తప్ప కామన్ ఆడియన్స్ అయితే మూవీ రన్ టైం గురించి ఎక్కువ ఆలోచించలేదు. మూడు గంటల వినోదాన్ని హ్యాపీగా ఆస్వాదించారని చెప్పొచ్చు.

Tags:    

Similar News