బ్యాంకాంక్ లో కింగ్ ఆపరేషన్?
కోలీవుడ్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ములా దర్శకత్వంలో `కుబేర` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ములా దర్శకత్వంలో `కుబేర` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈడీ ఆఫీసర్ పాత్రలో నాగ్ కనిపించ నున్నారని ప్రచారం సాగుతుంది. కుబేరుడు బిచ్చగాడిగా ఎలా మారాడు? అనడానికి మొన్నటి ధనుష్ లుక్ ని ఉదహరిస్తున్నారు. నిజమెంత? అన్నది తెలియదు గానీ ప్రచారం మాత్రం ఇలాగే జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొన్ని షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది.
చెన్నై..హైదరాబాద్ లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసారు. అవసరం మేర ప్రత్యేకమైన సెట్లు నిర్మించి షూటింగ్ చేసారు. తాజాగా కొత్త షెడ్యూల్ కోసం దేశం దాటినట్లు తెలుస్తోంది. బ్యాంకాక్ లో కొత్త షెడ్యూల్ మొదలైనట్లు యూనిట్ ప్రకటించింది. ఇందులో నాగార్జునతో పాటు కీలక నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగా నాగ్ పై ప్రత్యేకంగ ఆకొన్ని యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఇవి బ్యాంకాక్ రోడ్లపై సాగే ఛేజింగ్ సన్నివేశాలని సమాచారం. మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడంతో అక్కడి లోకేషన్లు డిమాండ్ చేయడంతో కమ్ములా అక్కడ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు అక్కడే నిరవధికంగా షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. దీన్ని బట్టి బ్యాంకాక్ షెడ్యూల్స్ లో నాగార్జున హైలైట్ అవుతారని చెప్పొచ్చు. అయితే బ్యాంకాక్ షూట్ లో ధనుష్ జాయిన్ అవుతాడా? అతడిపై సన్నివే శాలు ఉన్నాయా? లేదా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ములా తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శేఖర్ కమ్ములా యాక్షన్ శైలి ఎలా ఉంటుంది? అన్నది ఈ సినిమాతో పరిచయం కానుంది. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్-పుస్కూరు రామ్మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.