మోక్షజ్ఞ సడన్ బ్రేక్.. మళ్ళీ ఏమైనట్లు?
నందమూరి బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మూవీ ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే
నందమూరి బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మూవీ ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 5న ప్రారంభించబోతున్నట్లు ఎనౌన్స్ చేశారు. నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. అయితే ఎందుకనో ఈ మూవీ ఈ రోజు స్టార్ట్ కాలేదు. సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అయ్యారు.
ఇక ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ నుంచి ఈ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రాన్ని సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. మోక్షజ్ఞ మొదటి చిత్రమే పాన్ ఇండియా రేంజ్ లో రాబోతోందని అందరూ భావించారు. ‘హనుమాన్’ రేంజ్ లో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడం గ్యారెంటీ అని అనుకున్నారు.
అయితే ఏమైందో ఏమైకాని ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. అలాంటిదేం లేదని కొద్ది రోజులు ఈ మూవీ షూటింగ్ వాయిదా వేసారని మరో టాక్ నడుస్తోంది. స్క్రిప్ట్ పరంగా ఇంకా బెటర్ చేయడానికి షూటింగ్ ఆపారనే మాట వినిపిస్తోంది. అయితే ఇందులో ఏది వాస్తవం అనేది క్లారిటీ లేదు.
మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకే సడెన్ గా ఆటంకాలు ఎదురవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఏది వాస్తవం అనేది అఫీషియల్ గా ఎవరో ఒకరి నుంచి స్పష్టత వస్తే కాని తెలియదు. గత కొద్ది రోజుల నుంచి మోక్షజ్ఞ రెండో సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మొదలైందనే టాక్ నడుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతోందని ప్రచారం జరుగుతోంది.
అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమాకి సంబందించిన అన్ని ఏర్పాట్లు జరిగిన కూడా ఇంకా మోక్షజ్ఞ మెంటల్ గా కెమెరా ముందుకి రావడానికి సిద్ధంగా లేకపోవడం వలన కొద్ది రోజులు వాయిదా వేసారని అనుకుంటున్నారు. నందమూరి నటసింహం బాలయ్య కొడుకు కెరియర్ గురించి చాలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆదిలోనే ఇలాంటి ఎదురుదెబ్బలు తగులుతూ ఉండటంతో రకరకాల కథనాలు ఈ చిత్రంపై వినిపిస్తున్నాయి.