బాల‌య్య‌ని రాత్రంతా క‌ష్ట‌పెడుతున్నారుగా!

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే

Update: 2024-01-31 05:52 GMT

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య ఇమేజ్ కి...బాబి మాస్ అంశాన్ని జోడించి తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. బోయ‌పాటి త‌ర్వాత హీరోని ఆ రేంజ్ లో చూపించ‌గల ద‌ర్శ‌కుడిగా బాబికి పేరుంది. ఈ నేప‌థ్యంలో ఈ కాంబినేష‌న్ లో సినిమా అంటే అంచ‌నాలు భారీగానే ఏర్ప‌డుతున్నాయి. బాల‌య్య‌ని ఎలా చూపించ‌బోతున్నాడు? అన్న ఉత్సాహం అభిమానుల్లో ఉర‌క‌లేస్తుంది.

ఈ నేప‌థ్యంలో సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒక‌టి అందింది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. దీనిలో భాగంగా బాల‌కృష్ణ‌పై ఓ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్నారుట‌. అయితే ఈ ఫైట్ అంతా రాత్రిపూట చిత్రీక‌రించాల్సి రావ‌డంతో షూట్ అంతా నైట్ జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. అలాగే ఈ షెడ్యూల్ ల్లోనే నైట్ స‌న్నివేశాలు పూర్తి చేస్తున్నారుట‌.

దీనిలో భాగంగా ఈ షెడ్యూల్ అంతా నైట్ లోనే పూర్తి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. బాల‌య్య చేసే ఈ యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాకే హైలైట్ గా ఉంటాయ‌ట‌. దీంతో ఈ స‌న్నివేశాల‌కు ఎంత ప్రాధాన్య‌త ఉంద‌న్న‌ది తెలుస్తుంది. బాల‌య్య‌తో పాటు ఇత‌ర కీల‌క తారాగ‌ణ‌మంతా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సినిమాలో బాబి డియోల్ విల‌న్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నైట్ షెడ్యూల్ లో బాబి పాల్గొం టున్నాడా? లేదా? అన్న‌ది తెలియాలి.

ఇక బాల‌య్య ద‌ర్శ‌కుల హీరో అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వాళ్లు చెప్పింది చేయ‌డమే త‌న విధిగా భావిస్తారు. ద‌ర్శ‌కుల‌కు ఓ విజ‌న్ అంటూ ఉంటుంద‌ని భావించి..వాళ్ల‌కి త‌న వ్య‌క్తిగ‌త స‌లహాలు ..సూచ‌న‌లు లాంటివి ఇవ్వ‌రు. బాల‌య్య స‌క్స‌స్ లో అత్యంత కీల‌క‌మైన‌ది ఈ అంశ‌మే. తాజాగా బాల‌య్య నైట్ షెడ్యూల్ లో ఎంతో డెడికేట్ గా పాల్గొంటున్నార‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News