ఆ సిటీ నందమూరి అడ్డా

నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పుడు థర్డ్ జనరేషన్ హీరోలు రూల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్టార్స్ గా దూసుకుపోతున్నారు

Update: 2023-12-12 03:54 GMT

నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పుడు థర్డ్ జనరేషన్ హీరోలు రూల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్టార్స్ గా దూసుకుపోతున్నారు. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు. త్వరలోనే అతని డెబ్యూ ఉండబోతోంది. ఇదిలా ఉంటే నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలయ్య అత్యధిక సినిమాలు చేశారు.

ఈ ఫ్యామిలీ హీరోల సినిమాలకి ఏలూరు సిటీ బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. నందమూరి వంశంలో సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య సినిమాలు అత్యధికంగా శతదినోత్సవ, అర్ధశతదినోత్సవ వేడుకలు ఏలూరు ఏరియాలోనే జరుపుకున్నాయి. ఎన్టీఆర్ నటించిన 50 సినిమాలు, అలాగే బాలయ్య నటించిన 50 సినిమాలు ఏలూరులో అర్ధశతదినోత్సవ సెలబ్రేషన్స్ జరుపుకున్నాయి.

మరి ఏ ఇతర హీరోల సినిమాలు ఈ రకమైన ఫీట్ అని అందుకోలేకపోయాయి. ఏలూరు అంటే నందమూరి ఫ్యామిలీ సినిమాలకి కేరాఫ్ అడ్డా అనేంతగా పాపులర్ అయ్యింది. బాలయ్య నరసింహానాయుడు సినిమా ఏలూరులోని అంబికామినీలో ఏకంగా 300 రోజులు ఆడింది. అలాగే సమరసింహారెడ్డి సినిమా అయితే సాయి బాలాజీ థియేటర్ లో 200 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇతర హీరోల సినిమాలేవీ ఏలూరులో ఈ రకమైన ఫీట్ సాధించలేదు. దీంతో నందమూరి హీరోలకి కూడా ఏలూరు మంచి సెంటిమెంట్ గా మారిపోయింది. ఏలూరు ఏరియాలో హిట్ టాక్ అందుకుంది అంటే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంది. అంతలా నందమూరి కుటుంబానికి ఆ ప్రాంతం కలిసొచ్చిన ఏరియాగా మారిపోయింది.

బాలయ్య తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా ఏలూరు ఏరియాలో బాగా ఆడాయి. మూడుతరాల హీరోలకి అక్కడి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. ఏలూరులో కూడా నందమూరి అభిమానులు ఎక్కువగా ఉంటారని సినీ ఇండస్ట్రీలో వినిపించే మాట. ప్రస్తుతం బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ తో మంచి జోరు మీదఉన్నాడు. ఈ మూడు సినిమాలకి కూడా ఏలూరులో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక తారక్ గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. అతని సినిమాలకి కూడా ఆడియన్స్ పట్టం కడుతున్నారు.

Tags:    

Similar News