సక్సెస్ తో హీరోయిన్ కన్నీటి పర్యంతం!
పరాజయం నిరుత్సాహ పరిస్తే..విజయం ఉత్సాహ పరుస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగల్గేది చాలా తక్కువ మందే. అందంతా అనుభవంతో మాత్రమే వస్తుంది.
పరాజయం నిరుత్సాహ పరిస్తే..విజయం ఉత్సాహ పరుస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగల్గేది చాలా తక్కువ మందే. అందంతా అనుభవంతో మాత్రమే వస్తుంది. ఈ విషయంలో హీరోలకంటే హీరోయిన్లు కాస్త బలహీనంగా ఉంటారు. కొన్ని కొన్ని సన్నివేశాలు వళ్ల కంటే కన్నీరు తెప్పిస్తుంది. ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. తాజాగా నందిత శ్వేత `హిడంబి` థాంక్స్ మీట్ లో అలాగే ఎమోషనల్ అయింది. చాలా కాలం తర్వాత వచ్చిన సక్సెస్ కావడంతో వేదికపైనే అందరి ముందు కన్నీటి పర్యంతం అయింది.
అవి కన్నీరు రూపంలో వచ్చిన ఆనంద బాష్పాలు. సినిమాలో తనకి అప్పగించిన బాద్యతని...ప్రేక్షకుల ఆదరణ... సక్సెస్ అయిన విధానం గుర్తు చేసుకుని అమ్మడు ఎమోషనల్ అయింది. అయితే ఈ కన్నీరుకి మరో బలమైన కారణం కూడా ఉంది. ఈ సినిమా తనకెంతో సెంటిమెంట్ గానూ కనెక్ట్ అయింది. ఈ సినిమా షూట్ లో ఉన్నప్పుడు తన తండ్రి కూడా చనిపోయారుట. ఆయన ఆశీస్సుల వల్లే ఈ రోజు ఇంత మంచి పేరు వచ్చిందని మనసులో భాధని బయట పెట్టింది. మరి ఈ సినిమా విజయం అమ్మడికి ఎలాంటి బాట వేస్తుందో చూడాలి. ఒకసారి నందిత శ్వేత గతంలోకి వెళ్తే..
నందిత `ఎక్కడికి పోతావు చిన్నవాడ` సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత `శ్రీనివాసకళ్యాణం`,`బ్లప్ మాస్టర్ `లాంటి చాలా చిత్రాలు చేసింది. కానీ ఏవి అమ్మడిని విజయ మార్గంలో నడించలేదు. అయినా అడపా దడపా సినిమాల్లో నటిస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో బుల్లి తెరపై అవకాశాలు రావడంతో అక్కడా ఎంట్రీ ఇచ్చింది.
టీవీ షోలకు జడ్డ్ గా పనిచేస్తూనే అవకాశాలు వచ్చినప్పుడల్లా తెరపైనా మెరిసింది. అయితే నందితకి అనారోగ్య సమస్య ఉన్నట్లు ఇటీవల రివీల్ చేసింది. ఫైబ్రోమయోల్జియా అనే కండర రుగ్మతతో చాలాకాలంగా బాదపడుతోంది. ఈ రుగ్మత కారణంగా బరువు పెరిగిపోవడం...శరీరమంతా కొవ్వు పేరుకు పోవడం వంటివి జరుగుతుంటాయి. ఇది శాశ్వత జబ్బు. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే బరువు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. దానికి సంబంధించి జాగ్రత్తలు తప్పనిసరి. ఇలా తనలో ఉన్న రుగ్మతని బ్యాలెన్స్ చేస్తూ సినిమాల్లో రాణించే ప్రయత్నం చేస్తోంది.