నాని 'ఎల్లమ్మ'.. ఆ హీరో వద్దకు..

బలగం సినిమాతో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు సెకండ్ మూవీ కోసం చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు.

Update: 2024-09-13 20:30 GMT

బలగం సినిమాతో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు సెకండ్ మూవీ కోసం చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. దిల్ రాజు బ్యానర్ లోనే వేణు సెకండ్ మూవీ కూడా ఉండబోతోందని ఇప్పటికే స్పష్టం అయ్యింది. గతంలో నేచురల్ స్టార్ నాని హీరోగా వేణు సినిమా చేస్తాడనే ప్రచారం నడిచింది. ఎల్లమ్మ టైటిల్ తో నాని హీరోగా వేణు సినిమా తెరకెక్కనుందని టాక్ బయకొచ్చింది.


అలాగే ఈ సినిమా గురించి లీక్స్ కూడా గట్టిగానే వచ్చాయి. ఎందుకనో మరల వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ క్యాన్సిల్ అయినట్లు తరువాత క్లారిటీ ఇచ్చారు. సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ లో నాని బలగం వేణుతో సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. అయితే అది ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఇదిలా ఉంటే నాని రిజక్ట్ చేసిన ఎల్లమ్మ స్టోరీతో వేణు ఇప్పుడు యంగ్ హీరో నితిన్ తో మూవీ చేయబోతున్నాడంట.

నితిన్ దిల్ రాజు బ్యానర్ లో ప్రస్తుతం తమ్ముడు సినిమా చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దిల్ రాజు కూడా నిర్మాతగా నితిన్ దిల్ సినిమాతోనే కెరియర్ స్టార్ట్ చేశారు. ఆ మూవీ టైటిల్ దిల్ రాజు ఇంటిపేరుగా మారిపోయింది. మరల నితిన్ తో దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం మూవీ చేశారు. అది ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తోన్న మూవీ మాత్రం హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.

దీని తర్వాత బలగం వేణుతో చేయనున్న ఎల్లమ్మ సినిమా కోసం నితిన్ ని తీసుకోవాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం ఈ మూవీ గురించి నితిన్ తో డిస్కషన్స్ నడుస్తున్నాయంట. త్వరలో ఈ చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. నితిన్ ఈ మూవీకి ఒకే చెబితే వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేయొచ్చని అంటున్నారు. బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న వేణు నెక్స్ట్ ఎలాంటి కథాంశంతో మూవీ చేస్తాడా అనే అందరూ వెయిట్ చేస్తున్నారు.

ఈ సారి భారీ బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎల్లమ్మ మూవీ చేయబోతున్నాడనే ప్రచారం అయితే నడుస్తోంది. అందులో వాస్తవం ఏంటనేది తెలియదు. ఇదిలా ఉంటే నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ చిత్రం చేస్తున్నాడు. డిసెంబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అయితే ఈ సినిమాకి సంబందించిన ఎలాంటి సౌండ్ లేదు. శ్రీలీల రాబిన్ హుడ్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తోన్న తమ్ముడు మూవీ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రిలీజ్ అవ్వొచ్చంట. సప్తమిగౌడ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

Tags:    

Similar News