నాని సక్సెస్ ల సీక్రెట్ ఏంటి… ఇప్పుడిదే చర్చ
నేచురల్ స్టార్ నాని కెరియర్ 2008లో ప్రారంభమైంది. అయితే 2015లో వచ్చిన నేను లోకల్ నుంచి నాని ఎక్కువ సక్సెస్ లు అందుకున్న టాలీవుడ్ హీరోగా ఉన్నాడు.
నేచురల్ స్టార్ నాని కెరియర్ 2008లో ప్రారంభమైంది. అయితే 2015లో వచ్చిన నేను లోకల్ నుంచి నాని ఎక్కువ సక్సెస్ లు అందుకున్న టాలీవుడ్ హీరోగా ఉన్నాడు. మధ్యలో కొన్ని కమర్షియల్ ఫెయిల్యూర్ అయిన కూడా భారీ నష్టాలు అయితే ఏ సినిమా తీసుకురాలేదు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి చాలా సినిమాలు ఎడ్జ్ లో వచ్చి ఆగిపోయాయి. దీనిని బట్టి నానికి పబ్లిక్ నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందో అర్ధం చేసుకోవచ్చు.
చాలా మంది హీరోలు అయితే మాస్ లేదంటే క్లాస్ ఇమేజ్ కి పరిమితం అయిపోతారు. వారికి ఆ జోనర్ లో సినిమాలు చేస్తేనే సక్సెస్ లు వస్తాయి. అలా కాకుండా జోనర్ మార్చి మూవీస్ చేద్దామని ప్రయత్నం చేస్తే దెబ్బ తింటున్నారు. అయితే నాని వీటికి భిన్నంగా తన కెరియర్ ని బిల్డ్ చేసుకున్నారు. ఒకే జోనర్ కథలని కంటిన్యూగా చేయకుండా డిఫరెన్స్ చూపిస్తూ ఎప్పటికప్పుడు తనని కొత్తగా ప్రేక్షకులకి పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు.
కథల ఎంపిక పరంగా చూసుకుంటే ఇతర హీరోల కంటే భిన్నంగా నాని ఉంటాడనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. తాను ఏ జోనర్ లో మూవీస్ చేసిన ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే బలమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రం కచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. ఆ ఎమోషనల్ సీక్వెన్స్ ని ప్రతి ఒక్కరు వారి లైఫ్ కి రిలేట్ చేసుకుంటే సినిమాకి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారని నమ్ముతారు.
నాని సినిమాలలో కథల శైలి చూసుకుంటే ఇదే కనిపిస్తూ ఉంటుంది. అందుకే సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని సినీ విశ్లేషకుల మాట. అందుకే టాలీవుడ్ లో నాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. ప్రేక్షకులని మెప్పించడంలో అందరూ ఫెయిల్ అవుతున్న చోట నాని ఎలా సక్సెస్ లు అందుకుంటున్నాడనే విషయంపై చర్చించుకుంటున్నారు. శ్యామ్ సింగరాయ్ కథని పీరియాడిక్ డ్రామాతో చేసి నాని సక్సెస్ అందుకున్నాడు.
అందులో బలమైన సోషల్ ఎలిమెంట్ తో పాటు మంచి లవ్ స్టోరీ ఉంది. దీనికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అంటే సుందరానికి చిత్రాన్ని ప్యూర్ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీతో ఎంటర్టైన్మెంట్ జోనర్ లో చేశారు. ఈ మూవీ పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. దసరా కథని కంప్లీట్ కల్ట్ మాస్ ఎలిమెంట్స్ తో చెప్పాడు. ఫ్రెండ్ షిప్ అండ్ లవ్ స్టోరీని ఇందులో మెయిన్ ఎలిమెంట్ గా పెట్టారు. హాయ్ నాన్న సినిమాలో మంచి లవ్ స్టోరీతో పాటు తండ్రి కూతుళ్ళ బంధాన్ని గొప్పగా ఆవిష్కరించే ప్రయత్నం చేసి హిట్ అందుకున్నారు.
ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాలో మనకొచ్చే కోపం సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. మనవాళ్ళని కాపాడుకునేందుకు రావాలి అనే విషయాన్ని మాస్ అండ్ ఎమోషల్ టచ్ తో చెప్పి ప్రేక్షకులని మెప్పించాడు. ఇలాంటి ఇంటరెస్టింగ్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ని మిగిలిన హీరోలు పట్టుకోలేక ఫెయిల్యూర్స్ అందుకుంటే, నాని మాత్రం సక్సెస్ అవుతున్నాడు అనే మాట వినిపిస్తోంది.