పవన్ పై నాని అభిమానం.. మళ్ళీ ఇలా..

అయితే పవన్ కళ్యాణ్ సినిమా కాకుండా ప్రజాసేవ కోసం రాజకీయాలని ఎంచుకున్నారు.

Update: 2024-11-23 06:24 GMT

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ని సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు అభిమానిస్తూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ తో ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన తర్వాత అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సినిమాలపై ఫోకస్ చేసి ఉంటే ఈపాటికి పాన్ ఇండియా స్టార్ గా ఉండేవాడని అందరూ అంటారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా కాకుండా ప్రజాసేవ కోసం రాజకీయాలని ఎంచుకున్నారు.

దారుణమైన ఓటమి తర్వాత పదేళ్ళ సహణంతో 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ సాధించారు. జనసేన పార్టీని ఏపీలో బలమైన శక్తిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలలో కూడా అందరి దృష్టిని ఆకర్షించే నేతగా ఉన్నారు. ఇదిలా ఉంటే చాలా మంది హీరోలు పవన్ కళ్యాణ్ ని సినిమా స్టార్ గా కంటే వ్యక్తిగతంగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని కూడా ఉంటారు.

పవన్ కళ్యాణ్ అంటే నానికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. తాజాగా ‘రానా దగ్గుబాటి షో’ అమెజాన్ ప్రైమ్ లో మొదలైంది. ఇందులో మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ లుగా నాని, తేజ సజ్జా, ప్రియాంకా అరుళ్ మోహన్ వచ్చారు. రానా వారితో చాలా అంశాలపై డిస్కస్ చేశారు. గతంలో ‘నెంబర్ వన్ యారి’ తో రానా హోస్ట్ గా అందరిని మెప్పించాడు. ఇప్పుడు ‘రానా దగ్గుబాటి షో’తో కూడా హోస్ట్ గా మరోసారి అలరించబోతున్నాడు.

ఇందులో భాగంగా రానా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ గురించి అడిగారు. ప్రియాంకా అరుళ్ మోహన్ ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అందులో భాగం కావడం ఎలా అనిపిస్తుందని రానా ఆమెని అడిగారు. వన్ ఇయర్ బ్యాక్ ఆయన తో కలిసి వర్క్ చేసాను. ఆయనతో పని చేయడం చాలా ఎంజాయ్ అనిపించిందని ప్రియాంకా చెప్పింది.

ఈ సారి ఆయన రాజకీయాలు కూడా సినిమాల తరహాలోనే చాలా ఆసక్తి క్రియేట్ చేశాయని రానా అన్నారు. ఏదైనా ఇంటరెస్టింగ్ గా జరిగినపుడు వావ్ అనిపిస్తుంది అని చెబుతూ.. ఈ సందర్భంగా నాని పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు. ఆయన సినిమాలలో ఉన్నప్పుడు ఒక మిస్టిక్ పర్సనాలిటీ. సినిమాలు చేస్తున్నారు. ఒక బిగ్ స్టార్. అయితే పాలిటిక్స్ లోకి వచ్చాక మనిషి పర్సనల్ గా తెలిశాడు అనే ఫీలింగ్ వచ్చేసింది, గ్రేట్ అని అనిపించింది.. అని నాని పాజిటివ్ గా స్పందించారు.

నాని చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ గెలవక ముందు కూడా నాని పవన్ కళ్యాణ్ పై చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. మెగా హీరోలు కాకుండా ఆయన గెలవాలి అని చాలా బలంగా మాట్లాడిన బయట హీరోల్లో నాని ఒకరు. అది మెగా ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. ఇక మరోసారి రానా షోలో పవన్ గురించి పాజిటివ్ గా స్పందించారు నాని. దీంతో మరోసారి పవన్ ఫ్యాన్స్ నాని మాటలకు ఫిదా అవుతున్నారు.

Tags:    

Similar News