ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోదరుడి కుమారుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు నారా రోహిత్. రోటీన్ కథలను కాకుండా, సినిమాకీ, సినిమాకీ మధ్య చాలా వైవిధ్యం ఉండేలా చూసుకున్నారు. నారా రోహిత్ సినిమా అంటే, హిట్ గ్యారెంటీ అనే భావన జనాల్లోకి కూడా వెళ్లిపోయింది. కానీ, మధ్యలో ఆయన ఎంచుకున్న కొన్ని కథలు మాత్రం పెద్దగా క్లిక్ అవ్వలేకపోయాయి.
దీంతో, ఆయన కెరీర్ ట్రాక్ తప్పింది. వరసగా రెండు మూడు ప్లాప్ లు రావడంతో ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యారు. సడెన్ గా ఆయన సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ, ఆయనేమీ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. కానీ, చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారట.
ఆయన కెరీర్ లో ప్రతినిధి సినిమా చాలా స్పెషల్. ఆ సినిమా కథ, తీసిన విధానం, రోహిత్ నటకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ బాక్సాఫీసు వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే, ఇప్పుడు ఇదే మూవీకి సీక్వెన్స్ తీయాలని ఆయన అనుకుంటున్నారట. ఇన్ సైడ్ టాక్ ప్రకారం మూవీ షూటింగ్ మొదలైందని తెలుస్తోంది.
దీనికి తోడు ఆయన ఏమీ చెప్పకుండా కేవలం ఓ సమయాన్ని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రేపు సాయంత్రం 7గంటల రెండు నిమిషాలు అంటూ ట్వీట్ చేశారు. ఆ సమయంలో ఆయన తన మూవీ టైటిల్ , కానీ సినిమా అప్ డేట్ గానీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదంటే, డైరెక్ట్ గా టీజర్ విడుదల చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ విషయం తెలియాలంటే ఆయన చెప్పిన సమయం వరకు ఎదురు చూడాల్సిందే.
అయితే, ఈ మూవీలో ఆయన మీడియాపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయాలతో పాటు, పలు టీవీ సంస్థలు ఈ మధ్యకాలంలో వార్తలు చూపిస్తున్న విధానాన్ని ఎత్తి చూపుతూ సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఆయన నుంచి మరో అప్ డేట్ వచ్చే వరకు ఈ విషయంలో క్లారిటీ ఉండదనే చెప్పాలి.