కుమారుడి పెళ్లికి వెళ్లినా మనసులో ప్రియుడి ఆలోచనలే!
రీలపై ప్రేమ పాఠాలు పండించిన జోడీ రియల్ లైఫ్ లో మాత్రం ఒకటి కాలేకపోయారంటారు
రాజ్ కపూర్-నర్గీస్ ప్రేమాయణం గురించి బాలీవుడ్ లో కథకథలుగా మాట్లాడుకుంటారు. రీలపై ప్రేమ పాఠాలు పండించిన జోడీ రియల్ లైఫ్ లో మాత్రం ఒకటి కాలేకపోయారంటారు. ఇద్దరు జంటగా 18 సినిమాల్లో నటించారు. ఆ జోడీ అంటే అప్పట్లో ఓ బ్రాండ్. అయితే కొన్ని సినిమాల అనంతరం రాజ్ కపూర్ కి కృష్ణతో పెళ్లయింది. ఆ జంటకు పిల్లలు కూడా ఉన్నారు. అనంతరం నర్గీస్ నటుడు సునీల్ దత్ ని వివాహం చేసుకున్నారు.
పెళ్లి అనంతరం నర్గీస్ రాజ్ కపూర్ తో సినిమాలు చేయడం మానేసారు. ఆ తర్వాత రాజ్ కపూర్ ఇంట ఫ్యామిలీ ఫంక్షన్లకు పిలిచినా నర్గీస్ హాజరయ్యేవారు కాదు. దాదాపు 24 ఏళ్లు ఇలాగే గడిచిపోయింది. ఆ తర్వాత రాజ్ కపూర్ కుమారుడు రిషీ కపూర్ వివాహానికి మాత్రం తప్పక రావాలంటూ రాజ్ కపూర్ పట్టుబట్టారు. ప్రామిస్ కూడా చేయించుకున్నారు. దీంతో ఆ మాటకు కట్టుబడి నర్గీస్ రిషీ కపూర్ తన భర్తను తీసుకుని వివాహానికి వెళ్లారు.
మనిషి అయితే వెళ్లింది. కానీ మనసు మాత్రం ఎక్కడో ఆలోచనలతో నింపేసారు. దీంతో నర్గీస్ ఇబ్బందిని కృష్ణ కపూర్ గుర్తించారు. నర్గీస్ దగ్గరకు వెళ్లి నాభర్త అందగాడు. రొమాంటిక్ కూడా. అతను ఆకర్షించని వాళ్లు ఉండరు. నున్వు ఏం ఆలోచిస్తున్నావో? నేను ఊహించగలను. బాధపడుకు అని ఓదార్చారు కృష్ణ. గతం మర్చిపోయి వర్తమానంలో జీవించమని కోరారు.
మా ఇంట్లో శుభకార్యానికి వచ్చావ్? మీరు నా అతిధి? మీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకో వడం నా బాధ్యత. మిమ్మల్ని బాధపడకుండా చేయడం కూడా నాదే బాధ్యత అని ఓదార్చారు. ఈ విషయాలు అన్నింటిని రిషీకపూర్ తన పుస్తకంలో రాసుకున్నారు. అలాగే వైజయంతీ మాలతో కూడా తన తండ్రి ఎంతో సన్నిహితంగా ఉండేవారు అన్న విషయాన్ని పుస్తకంలో ప్రస్తావించారు రిషీ.