అల్లుడితో సీఎంని కలిసిన నటసింహం!
ఆ సంగతి పక్కనబెడితే తాజాగా కొద్ది సేపటి క్రితమే నటసింహ బాలకృష్ణ కూడా సీఎం రేవంత్ ని కలిసారు.
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలుస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని గంటల క్రితమే నాగార్జున దంపతులు సీఎంని కలిసారు. ఆ వీడియో..ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి కలిసిన వెంటనే నాగార్జున కలవడం ఆసక్తికరంగా మారింది. ఆ సంగతి పక్కనబెడితే తాజాగా కొద్ది సేపటి క్రితమే నటసింహ బాలకృష్ణ కూడా సీఎం రేవంత్ ని కలిసారు.
నాగార్జున కలిసి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ సన్నివేశం చోటు చేసుకుంది. బాలకృష్ణ తన చిన్న అల్లుడు భరత్‌తో కలిసి రేవంత్ రెడ్డిని కలిశారు. బాలయ్య-రేవంత్ తొలిసారి కలవడంతో ఇద్దరు ఎంతో ఆప్యాయం గా పలకరించుకుని నవ్వుకున్నారు. బాలకృష్ణతో పాటు బసవతారకం ఇండో-అమెరికన్ మెడికల్ హాస్పిటల్ సభ్యులు కూడా ఉన్నారు. ఇలా వరుసగా సెలబ్రిటీలు సీఎంని కలవడంతో ఆసక్తి సంతరిం చుకుంది.
ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించిన కొంత మంది పెద్దలు రేవంత్ ని కలిసి అభినందనలు తెలిపారు.
తొలుత రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించిన సమయంలో టాలీవుడ్ నుంచి ముందుగా చిరంజీవి అభినం దనలు తెలిపిన సంగతి తెలిసిందే. అటుపై సోషల్ మీడియాలో ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖు లు రేవంత్ విజయంపైశుభాకాంక్షలు తెలియజేసారు.
గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలోనే సినీ పెద్దలు ఆయన్ని ఎప్పటికప్పుడు కలిసేవారు. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగేది. వాటిలో కొన్నింటిని పరిష్కరిం చినట్లు పెద్దలు తెలిపిన సందర్భాలున్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఆయనతోనూ చాలా అవసరాలు..పనులు ముడి పడి ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కరుగా కలుస్తున్నారు.