ముగిసిన నవదీప్ విచారణ.. ఏం చెప్పారంటే
ఇకపోతే విచారణ ముగిసిత తర్వాత బయటకు వచ్చిన నవదీప్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని నవదీప్ అన్నారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ నార్కోటిక్ విచారణ ముగిసింది. ఆరు గంటల పాటు నవదీప్‌ను నార్కో అధికారులు విచారించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న దేవరకొండ సురేశ్, రామచంద్రతో నవదీప్‌కు ఉన్న పరిచయాలపై అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. సినీ ఫైనాన్సర్ వెంకటరత్నారెడ్డితో కూడా ఉన్న పరిచయాలపై కూడా ఆరా తీశారట. ఇంకా నవదీప్‌పై అధికారులు పలు రకరకాల ప్రశ్నల వర్షం కురిపించారట.
ఇకపోతే విచారణ ముగిసిత తర్వాత బయటకు వచ్చిన నవదీప్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని నవదీప్ అన్నారు. డ్రగ్స్ కేసులో సీపీ సీవీ ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీమ్ బాగా పని చేస్తుందని తెలిపారు. విచారణలో భాగంగా నార్కోటిక్ అధికారులు అడిగి ప్రశ్నలన్నింటికీ తాను క్లియర్‌గా సమాధానం చెప్పినట్లు పేర్కొన్నారు.
రిమోట్ లింక్‌ను ఇన్వెస్ట్ చేసి క్వశ్చన్స్ అడిగారు. గతంలో బీపీఎమ్ అనే పబ్‌లో నా ఇన్ వాల్వ్మెంట్ ఉండటం, అలాగే నా పేరు సిట్, ఈడీలో వినపడటం వల్ల ఇప్పుడు నన్ను పిలిచి ప్రశ్నించారు. వాళ్లు చాలా చక్కగా పనిచేస్తున్నారు. దర్యాప్తును బాగా లోతుగా వెళ్లి చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో మంచి నార్కోటిక్స్ బ్యూరో టీమ్ ఇది. ఏడేళ్ల పాత ఫోన్ రికార్డులను పరిశీలించి మరీ ప్రశ్నలు అడిగారు. నేను వారు అడిగిన ప్రతీ దానికి సమాధానం ఇచ్చాను. నిందితుడిగా ఉన్న రామ్‌చందర్ అనే వ్యక్తి తెలుసంతే. నాకు అంతకుమించి ఎలాంటి పరిచయాలు లేవు. అని నవదీప్ పేర్కొన్నారు.
అవసరం ఉంటే అధికారులు తనను మళ్లీ పిలుస్తామని చెప్పినట్లు నవదీప్ తెలిపారు. మీడియా వాళ్లు ఈ విషయం గురించి పక్కాగా తెలుసుకుని తన గురించి రాయమని సూచించారు. ఈ కేసు విషయమై తాను పరారీలో ఉన్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని మరోసారి నొక్కి చెప్పారు. కాగా ఇకపోతే నవదీప్ ఫోన్‌ను నార్కోటిక్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు బయట కథనాలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా స్పష్టత లేదు.