కేఫ్ లో...బిర్యానీ సెంటర్లో పనిచేసాను!
`అందాల రాక్షసి`తో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర జర్నీ గురించి తెలిసిందే. హీరోగా ఎంట్రీ ఇచ్చినా అది కొన్ని సినిమాలకే పరిమితమైంది.
`అందాల రాక్షసి`తో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర జర్నీ గురించి తెలిసిందే. హీరోగా ఎంట్రీ ఇచ్చినా అది కొన్ని సినిమాలకే పరిమితమైంది. అటుపై అతడి జర్నీ మరోలా టర్నింగ్ తీసుకుంది. హీరోగా ఫెయిలవ్వడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్నింగ్ తీసుకున్నాడు. హీరోగా సక్సెస్ కానప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. కానీ నవీన్ చంద్ర హీరోగా సక్సెస్ అవ్వడానికి కావాల్సిన అన్ని క్వాలిటీలు అతడిలో ఉన్నాయి.
మంచి హైట్..వెయిట్..అందగాడు కావడంతోనే హనురాఘవపూడి ` అందాల రాక్షసి`లో హీరోగా తీసుకున్నాడు. కానీ తాను ఒకటనుకుంటేమరోలా జరిగింది. అయితే నవీన్ జర్నీ ట్రాక్ తప్పడానికి అతడి వ్యవహర శైలి కూడా ఓ కారణం అని గతంలో చాలాసార్లు మీడియా లో కథనాలు వెలువడ్డాయి. అయినా అదంతా గతం. ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ మాత్రం బాగా సాగుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడి గురించి రివీల్ చేసాడు.
`మొదటి నుంచి నాకు డాన్స్ పై ఆసక్తి ఎక్కువగా ఉండేది. బళ్లారిలో నా డాన్స్ షోస్ చూడటానికి జనాలు భారీగా వచ్చేవారు. దాంతో నా దృష్టి సినిమాలపైకి వెళ్లింది. ఇండస్ట్రీలో నాకు తెలిసినవారెవరూ లేరు. ఇక్కడ నిలబడేవ రకూ ఒక ఇన్ కమ్ అనేది నాకు అవసరం. అందువలన కెఫెలో , బిర్యానీ సెంటర్లో పనిచేశాను. డైలీ కలెక్షన్లు చూసుకునే పని కూడా చేశాను. సినిమాల దిశగా రావడానికీ , ఇక్కడ నిలదొక్కుకోవడానికి కొంత సమయం పట్టింది.
ఇంకాస్త ముందుగావచ్చి ఉంటే నా కెరియర్ ఇంతకంటే బెటర్ గా ఉండేదేమోనని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. సమయం ఉన్నప్పుడు నేను పాత సినిమాలను ఎక్కువగా చూస్తుంటాను. రేలంగి .. రమణారెడ్డి .. సూర్యకాంతం నటన అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల సినిమాలు అవకాశం ఉన్నప్పుడు చూస్తుంటాను. పాత తరం నటుల ఎంతో సహజంగా నటించేవారు. అప్పటి నిజ జీవితాలకు ఆ సినిమాలు వాస్తవ రూపాలు` అని అన్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన `సత్యభామ` సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇంకా చేతిలో కొన్ని సినిమాలున్నాయి.